iDreamPost
android-app
ios-app

బేబీ కాంబో.. బిగ్ బాస్ బ్యూటీతో బోల్డ్ స్టెప్ వేయిస్తోందా?

  • Author ajaykrishna Updated - 10:43 PM, Mon - 30 October 23

సోషల్ మీడియా స్టార్ నుండి బిగ్ బాస్ బ్యూటీగా క్రేజ్ సొంతం చేసుకుంది అలేఖ్య హారిక. ఇండస్ట్రీలో నటిగా రాణించాలని చాలా ప్రయత్నాలు చేసింది. కానీ.. ఇన్నాళ్లకు బేబీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కాంబినేషన్ లో హీరోయిన్ గా డెబ్యూకి రెడీ అయిపోయింది. మరి ఆ వివరాల్లోకి వెళ్దాం.

సోషల్ మీడియా స్టార్ నుండి బిగ్ బాస్ బ్యూటీగా క్రేజ్ సొంతం చేసుకుంది అలేఖ్య హారిక. ఇండస్ట్రీలో నటిగా రాణించాలని చాలా ప్రయత్నాలు చేసింది. కానీ.. ఇన్నాళ్లకు బేబీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కాంబినేషన్ లో హీరోయిన్ గా డెబ్యూకి రెడీ అయిపోయింది. మరి ఆ వివరాల్లోకి వెళ్దాం.

  • Author ajaykrishna Updated - 10:43 PM, Mon - 30 October 23
బేబీ కాంబో.. బిగ్ బాస్ బ్యూటీతో బోల్డ్ స్టెప్ వేయిస్తోందా?

బేబీ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ అందుకున్న కాంబినేషన్ డైరెక్టర్ సాయి రాజేష్ – నిర్మాత SKN. వీరి కాంబోలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కిన బేబీ.. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిన్న సినిమాలలో ఒకటి. అందరికీ తెలుసు.. బేబీ మూవీతో సోషల్ మీడియా స్టార్ అయిన వైష్ణవి చైతన్య.. హీరోయిన్ గా డెబ్యూ చేసింది. ఆ సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించడంతో.. వైష్ణవికి హీరోయిన్ గా శుభారంభం లభించిందని చెప్పవచ్చు. ఇప్పుడదే ఊపులో వైష్ణవి.. సెకండ్ మూవీ కూడా బేబీ కాంబినేషన్ లోనే చేస్తోంది. రీసెంట్ గా అనౌన్స్ మెంట్ కూడా జరిగింది. ఈసారి డైరెక్టర్ సాయి రాజేష్ కూడా SKN తో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

బేబీ కాంబినేషన్ లో కేవలం డైరెక్టర్ చేంజ్ అయ్యాడు తప్ప.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి కూడా సేమ్ రిపీట్ అవుతున్నారు. కాగా.. ఇప్పుడు తాజాగా అదే సాయి రాజేష్-SKN.. కొత్త సినిమా అనౌన్స్ చేశారు. అదికూడా భగ్న ప్రేమకు సంబంధించిన స్టోరీలాగే అనిపిస్తుంది. ఎందుకంటే.. పోస్టర్ లో చూస్తే.. ‘కొన్ని ప్రేమకథలు జీవితకాలం వెంటాడుతాయి’ అని క్యాప్షన్ జోడించారు. ఈ సినిమాకి సుమన్ పాతూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కొత్తగా అనౌన్స్ చేసిన మూవీలో హీరో సంతోష్ శోభన్ కాగా, హీరోయిన్ గా బిగ్ బాస్ ఫేమ్ అలేఖ్య హారిక (దేత్తడి హారిక)ని పరిచయం చేయబోతున్నారు. అలేఖ్య కూడా సోషల్ మీడియా స్టార్ గా అందరికీ సుపరిచితం.

ఆ తర్వాత బిగ్ బాస్ లో అడుగు పెట్టడంతో టీవీ ప్రేక్షకులకి పరిచయం అయ్యింది. అయితే.. బిగ్ బాస్ టాప్ 5 లో నిలిచిన అలేఖ్య.. హౌస్ నుండి బయటికి వచ్చాక సినిమాలలో బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. అలా ఏం జరగలేదు. కానీ.. సడన్ గా బేబీ మేకర్స్ కాంబినేషన్ లో హీరోయిన్ గా సినిమా అనౌన్స్ చేయడంతో అలేఖ్య పేరు హాట్ టాపిక్ గా మారింది. అయితే.. లేటెస్ట్ పోస్టర్ లో అలేఖ్య – సంతోష్ లిప్ కిస్ పెట్టుకున్నారు. దీంతో మొన్న బేబీలో వైష్ణవితో లిప్ కిస్ పెట్టించారు. ఇక్కడ పోస్టర్ లోనే అలేఖ్యతో లిప్ లాక్ చేయించారు. సో.. బేబీ కాంబో పరిచయం చేస్తున్న హీరోయిన్స్ ఇద్దరినీ బోల్డ్ గానే ప్రెజెంట్ చేస్తున్నారని నెటిజన్స్, ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇక ఇప్పుడైనా అలేఖ్యకు బ్రేక్ లభిస్తుందేమో చూడాలి. మరి ఈ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgit girişgrandpashabet