iDreamPost

గౌతమ్ అదానీ జీవితాన్ని మార్చింది ఓ లేడీ డెంటిస్ట్ అంటే మీరు నమ్ముతారా?

గౌతమ్ అదాని వ్యాపార రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగారు. ఆయన ఇంతటి విజయం వెనకాల ఓ లేడీ డెంటిస్ట్ ఉందంటే మీరు నమ్ముతారా? ఇంతకీ ఆమె ఎవరంటే?

గౌతమ్ అదాని వ్యాపార రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగారు. ఆయన ఇంతటి విజయం వెనకాల ఓ లేడీ డెంటిస్ట్ ఉందంటే మీరు నమ్ముతారా? ఇంతకీ ఆమె ఎవరంటే?

గౌతమ్ అదానీ జీవితాన్ని మార్చింది ఓ లేడీ డెంటిస్ట్ అంటే మీరు నమ్ముతారా?

గౌతమ్ అదానీ.. వరల్డ్ వైడ్ గా పరిచయం అక్కర్లేని పేరు. వ్యాపారవేత్తగా.. ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా గౌతమ్ అదానీ కీర్తి గడించారు. గౌతమ్ అదానీ పోర్టుల నిర్మాణం, బొగ్గు పరిశ్రమలు, సిమెంట్ రంగం, విమాన రంగం, మీడియా, రిటైల్ రంగాలలో తన వ్యాపారాలను విస్తరించారు. బిజినెస్ లో తనకున్న అనుభవంతో అందనంత ఎత్తుకు ఎదిగారు. అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గా వ్యాపార సామ్రాజ్యంలో రారాజుగా వెలుగొందుతున్నారు. మరి ఇంతటి విజయం సాధించిన అదానీ జీవితాన్ని మార్చింది ఓ లేడీ డెంటిస్ట్ అంటే మీరు నమ్ముతారా? అవును నిజమే ప్రతి మగాడి విజయం వెనకాల ఓ స్త్రీ ఉంటుందన్నట్లు అదానీ జీవితంలో కూడా ఓ లేడీ డెంటిస్ట్ ఉంది. ఇంతకీ ఆమె ఎవరంటే?

అదానీ సంపద రాకెట్ స్పీడుతో దూసుకెళ్లింది. దీంతో ఆయన పేరు ఎప్పుడు వార్తల్లో మారు మ్రోగుతూనే ఉంటుంది. అయితే ఈ సంపద, వ్యాపారాల వెనకాల ఉన్నది ఓ లేడీ డెంటిస్ట్. ఆమె మరెవరో కాదు ఆయన భార్య ప్రీతి అదానీ. ప్రీతి గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఒక డెంటిస్ట్. ఈ విషయం చాలా మందికి తెలియదు. కాగా ఆమె డాక్టర్ స్థాయి నుంచి భర్త వ్యాపార ఎదుగుదలలో భాగస్వామై అదానీ గ్రూప్ వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నారు. 1986లో గౌతమ్ అదానీ-ప్రీతిల వివాహం జరిగింది. ప్రస్తుతం ప్రీతి అదానీ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు.

అదానీ ఫౌండేషన్ 1996లో ప్రారంభమైనప్పటి నుంచి అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల ద్వారా లక్షలాది మంది జీవితాలను మార్చేసింది అదానీ ఫౌండేషన్. తన కెరీర్ ఎదుగుదలకు, వ్యాపారంలో సక్సెస్ సాధించడానికి తన భార్య ప్రీతి కృషి మరువలేనిదని పలు వేదికల్లో గౌతమ్ అదానీ తెలిపారు. ఇక వీరికి కరణ్, జీత్ అదానీ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు ప్రస్తుతం అదానీ గ్రూప కంపెనీల్లో వివిధ స్థాయిల్లో సేవలు అందిస్తూ తండ్రితో పాటు వ్యాపార బాధ్యతల్లో పాలుపంచుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి