iDreamPost

OTT లవర్స్.. హాట్ స్టార్ లో తప్పక చూడాల్సిన 5 యాక్షన్ చిత్రాలు

Hotstar Best Action Movies: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చాలానే యాక్షన్ చిత్రాలు ఉంటాయి. కానీ, ఈ టాప్ బెస్ట్ 5 యాక్షన్ చిత్రాలను మాత్రం అస్సలు మిస్ కావొద్దు.

Hotstar Best Action Movies: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో చాలానే యాక్షన్ చిత్రాలు ఉంటాయి. కానీ, ఈ టాప్ బెస్ట్ 5 యాక్షన్ చిత్రాలను మాత్రం అస్సలు మిస్ కావొద్దు.

OTT లవర్స్.. హాట్ స్టార్ లో తప్పక చూడాల్సిన 5 యాక్షన్ చిత్రాలు

ఓటీటీల్లోకి లెక్కలేనన్ని చిత్రాలు వస్తూ ఉంటాయి. వాటిల్లో చాలామంది వచ్చిన సినిమాలు వచ్చినట్లు చూస్తుంటారు. కానీ, ఓటీటీల్లో ఉండే ఆల్ టైమ్ బెస్ట్ చిత్రాలను మాత్రం ఒక్కోసారి మిస్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా యాక్షన్ చిత్రాల విషయంలో చాలామంది అశ్రద్ధ వహిస్తూ ఉంటారు. మీకోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఉండే బెస్ట్ 5 యాక్షన్ చిత్రాలను తీసుకొచ్చాం. మరి.. ఆ మూవీస్ లిస్ట్ ఏంటి? ఆ మూవీస్ ని మీరు ఇప్పటికే చూశారా? ఆ మూవీస్ ఎందుకు అంత స్పెషలో చూద్దాం.

అవెంజర్స్ ఎండ్ గేమ్:

మార్వెస్ సినిమాటిక్ యూనివర్స్ లో అవెంజర్స్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్, హల్క్, థార్ ఇలా అందరూ విడి విడిగా ఎన్ని సినిమాలు చేసినా.. అందరినీ కలిపి కూడా చిత్రాలు చేస్తూ ఉంటారు. వాటిలో అవెంజర్స్ ఎండ్ గేమ్ కు వరల్డ్ వైడ్ గా ఎంత గొప్ప ఫ్యాన్ బేస్ ఉంది. 2019లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 2.79 బిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉన్న ఈ మూవీని ఒక్కసారైనా చూడాల్సిందే. అవెంజర్స్ అందరూ కలిసి థానోస్ తో పోరాడే ఆఖరి ఫైట్ నోరెళ్లబెట్టేలా చేస్తుంది.

బ్లాక్ పాంథర్:

బ్లాక్ పాంథర్ సినిమా గురించి యాక్షన్ మూవీ లవర్స్ కి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆరోనే బోస్మాన్ నటించిన చిత్రాల్లో ఈ మూవీ ది బెస్ట్ అని చెప్పచ్చు. ఆరోన్ బోస్మాన్ మరణించిన తర్వాత బ్లాక్ ఫాంథర్ మూవీకి మరింత ఆదరణ లభించింది. ఎన్నో అవెంజర్స్ సినిమాల్లో కనిపించిన బ్లాక్ పాంథర్ పాత్ర అసలు ఎలా వచ్చింది అనే విషయం తెలియాలంటే ఈ బ్లాక్ పాంథర్ మూవీ చూడాల్సిందే. ఈ మూవీని 200 మిలియన్ డాలర్లతో తెరకెక్కిస్తే.. ఏకంగా 1.34 బిలియన్ డాలర్లు కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. ఈ మూవీకి సీక్వెల్ కూడా తీసుకొచ్చారు. ఇ సినిమాలో కూడా బ్లాక్ పాంథర్ మరణించాడు అంటూ చూపిస్తూ కథను ముందుకు తీసుకెళ్లారు. మీరు గనుక ఈ మూవీని చూడకపోతే కచ్చితంగా చూడాల్సిన యాక్షన్ చిత్రాల్లో ఇది కూడా ఒకటి.

డెడ్ పూల్:

డెడ్ పూల్ సినిమా గురించి చాలామందికి ఇంట్రడక్షన్స్ అక్కర్లేదు. ఈ సూపర్ హీరో ఎంతో స్పెషల్ అని చెప్పాలి. ముఖ్యంగా ఈ క్యారెక్టర్ యాక్షన్ మాత్రమే కాదు.. డైలాగ్స్ కూడా ఎంతో కొత్తగా ఉంటాయి. పోరాట సన్నివేశాలు ఔరా అనిపిస్తాయి. మార్వెల్ కామిక్స్ లో ఉండే సూపర్ హీరో పాత్రను ఆధారంగా ఈ డెడ్ పూల్ సినిమాను స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రంలో రెండు పార్టులు వచ్చేశాయి. ర్యాన్ రేనాల్డ్స్ యాక్టింగ్ కోసం అయినా ఈ మూవీస్ చూడాల్సిందే. డెడ్ పూల్ చిత్రాన్ని 58 మిలియన్ డాలర్లతో తెరకెక్కిస్తే.. ఏకంగా 782 మిలియన్ డాలర్స్ కి పైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు డెడ్ పూల్ ఓల్వరీన్ అనే చిత్రం కూడా రాబోతోంది.

షాంగ్ ఛీ: ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్:

షాంగ్ ఛీ అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్ సినిమా చాలమందికి తెలియకపోవచ్చు. ఇది కూడా మార్వెల్ స్టూడియోస్ చిత్రమే. ఈ మూవీ తండ్రీకొడుకుల మధ్య జరిగే యుద్ధం. యాక్షన్, ఎమోషన్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మార్వల్ అవెంజర్స్ సినిమాకి ఏమాత్రం తీసిపోని ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా మంచి ఆదరణ లభించింది. ఇందులో యాక్షన్ మాత్రమే కాకుండా.. మంచి స్టోరీ కూడా ఉంటుంది. తండ్రి పేరును తనకు అంట కూడా చూసుకోవాలి అనుకునే కుమారుడు.. ఎలాగైనా కొడుకుని తనతు అడ్డు రాకుండా చేసుకోవాలి అని చూసే తండ్రి. ఈ మూవీని 200 మిలియన్ డాలర్లు పెట్టి తెరకెక్కించగా.. 432 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

డాక్టర్ స్ట్రేంజ్ మల్టీ వర్స్ మ్యాడ్ నెస్:

మార్వెల్ సూపర్ హీరోస్ లో డాక్టర్ స్ట్రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐరన్ మ్యాన్ తర్వాత డాక్టర్ స్ట్రేంజ్ కే అంత శక్తి, ఇంపార్టెన్స్ ఉంటాయి. డాక్టర్ స్ట్రేంజ్ కి సంబధించి చాలానే చిత్రాలు వచ్చాయి. కానీ, ఈ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్ మాత్రం నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. కథ, యాక్షన్, టేకింగ్, విజువల్స్, మ్యూజిక్ ఇలా ప్రతి అంశంలో టాప్ నాచ్ గా ఉంటుంది. మార్వెల్ మూవీ లవర్స్ ఇప్పటికే ఈ మూవీని చాలా సార్లు చూసుంటారు. కానీ, ఈ మూవీని ఇప్పటి వరకు చూడనివాళ్లు తప్పకుండా ఒకసారి చూసేయచ్చు. ఈ మూవీని 294 మిలియన్ డాలర్లతో తెరెకెక్కిస్తే.. 955.8 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. మరి.. ఈ మూవీస్ ని మీరు ఇప్పటికే చూస్తే మీకు బాగా నచ్చిన సినిమా ఏదో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి