iDreamPost
android-app
ios-app

Allu Arjun: అల్లు వాకిట్లో టాప్ డైరెక్టర్స్! ముగ్గురిలో ఒక్కరికే ఛాన్స్!

  • Published Jan 27, 2024 | 8:57 PM Updated Updated Jan 27, 2024 | 8:57 PM

అల్లు వాకిట్లో ముగ్గురు స్టార్ డైరెక్టర్స్ కథలతో ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఓకే చెప్తే పాన్ ఇండియా సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారు.

అల్లు వాకిట్లో ముగ్గురు స్టార్ డైరెక్టర్స్ కథలతో ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఓకే చెప్తే పాన్ ఇండియా సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారు.

  • Published Jan 27, 2024 | 8:57 PMUpdated Jan 27, 2024 | 8:57 PM
Allu Arjun: అల్లు వాకిట్లో టాప్ డైరెక్టర్స్! ముగ్గురిలో ఒక్కరికే ఛాన్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఒక్క సౌత్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో పుష్ప రాజ్ కోసం సినిమా లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప-2 సినిమా మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్టులో టాప్ ప్లేస్ లో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు మొదలు ప్రేక్షకుల వరకు అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ కోసం ముగ్గురు దిగ్గజ డైరెక్టర్లు కూడా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్లు ఎందుకు ఎదురుచూస్తున్నారంటే.. బన్నీతో నెక్ట్స్ ప్రాజెక్ట్ ఛాన్స్ కొట్టేయాలని. మరి.. ఆ డైరెక్టర్లు ఎవరు? ఆ లక్కీ ఛాన్స్ ఎవరిని వరిస్తుందో చూద్దాం.

పుష్ప-2 మూవీ వేగంగా పూర్తవ్వాలని చూస్తున్న ఆ ముగ్గురు డైరెక్టర్లు మరెవరో కాదు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, అట్లీ, బోయపాటినే. ఈ ముగ్గురు డైరెక్టర్లు ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం తెగ ఎదురు చూస్తున్నారు. పుష్ప రాజ్ తో తమ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఓకే చేయించుకోవాలని ఉవిళ్లూరుతున్నారు. బన్నీ గనుక ఓకే చెప్తే త్రివిక్రమ్ తొలి పాన్ ఇండియా సినిమా ఇదే అవుతుంది. నిజానికి పాన్ ఇండియా ఎంట్రీ కోసం త్రివిక్రమ్ కొంతకాలంగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే స్టార్స్ కాస్త బిజీ అయిపోవడంతో ఈ మాంత్రికుడు కాస్త వెనక్కి తగ్గినట్లు అనిపించింది. ఇప్పుడు అల్లు అర్జున్ తో ఓకే చెప్పించుకోవాలని గట్టిగానే ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు.

అలాగే పాన్ ఇండియా డైరెక్టర్ అట్లీ కూడా అల్లు అర్జున్ ప్రాజెక్ట్ కోసం చాలానే ఆశలు పెట్టుకున్నాడంట. పుష్ప-2 మూవీ పూర్తవ్వగానే బన్నీకి కథ చెప్పి ఓకే చేయించుకోవాలని తాపత్రయ పడుతున్నట్లు తెలుస్తోంది. అట్లీ ఇటీవల జవాన్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అలాగే నార్త్ లో కూడా అట్లీకి మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. కాబట్టి అట్లీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశాలు కూడా మెండుగానే ఉన్నాయి. అలాగే ఇంక మూడో డైరెక్టర్ బోయపాటి. ఇప్పటికే బన్నీకి సరైనోడు పేరుతో బిగ్ హిట్ ఇచ్చి ఉన్నాడు. అంతేకాకుండా బోయపాటి మాస్ టేకింగ్ కి.. బన్నీ యాక్టింగ్ కి పక్కాగా సెట్ అవుతుంది. అందుకే బోయపాటి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే గీతా ఆర్ట్స్- బోయపాటి సినిమా చేయబోతున్నారని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ బన్నీతో అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి బోయపాటికి కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి.

అయితే ఈ ముగ్గురు డైరెక్టర్లలో ఎవరు బన్నీ ప్రాజెక్ట్ సొంతం చేసుకుంటారు అనే విషయంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ముగ్గురిలో ఎవరు మంచి లైన్ తో వస్తే వారికే బన్నీ ఓకే చెప్తాడు అంటూ టాక్ నడుస్తోంది. ఇప్పటికే పుష్పతో సంచనాలు క్రియేట్ చేశాడు. పుష్ప-2 మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. తన తర్వాతి ప్రాజెక్టు కూడా వాటి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండాలని బన్నీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురు డైరెక్టర్ల నుంచి కథ వినేందుకు ఐకాన్ స్టార్ రెడీ అవుతున్నాడు. అయితే పుష్ప-2 షూటింగ్ అతి త్వరలోనే పూర్తికానున్న నేపథ్యంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో కూడా ఏ డైరెక్టర్ కథకు ఓకే చెప్తాడు అనే ఆసక్తి కూడా నెలకొంది. మరి.. బన్నీ తన నెక్ట్స్ మూవీ ఏ డైరెక్టర్ తో తీస్తే బాగుంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet