iDreamPost

ఎన్నాళ్ళు ప్రేమిస్తారండీ బాబూ.. అమ్మాయిలు, హీరోయిన్లు?

డైరెక్టర్ విక్రమ్ కుమార్ లవ్ స్టోరీస్ పై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అమ్మాయిలూ, హీరోయిన్లూ ఎన్నాళ్లు ప్రేమిస్తారు.. ప్రేమించి, ప్రేమించి విసుగెత్తి పోయారంటూ కామెంట్స్ చేశారు.

డైరెక్టర్ విక్రమ్ కుమార్ లవ్ స్టోరీస్ పై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అమ్మాయిలూ, హీరోయిన్లూ ఎన్నాళ్లు ప్రేమిస్తారు.. ప్రేమించి, ప్రేమించి విసుగెత్తి పోయారంటూ కామెంట్స్ చేశారు.

ఎన్నాళ్ళు ప్రేమిస్తారండీ బాబూ.. అమ్మాయిలు, హీరోయిన్లు?

యంగ్ హీరోయిన్లంటే లవ్ ప్టోరీలు, కాశ్మీర్లో పాటలు, సీషోర్ ఒడ్డున బికినీ సీన్లు.. ఇవి ఏజెస్ నుంచి చూస్తున్నవే. చూసి చూసి జనం విసిగెత్తిపోతే, హీరోయిన్లు, యంగ్ టాలెంట్ కూడా అంతే విరక్తికి లోనయ్యారని దర్శకుడు విక్రమ్ బాహాటంగా చెప్పేశాడు. అమెజాన్ ప్రైం ద్వారా విడుదలవుతున్న దూత ప్రమోషనల్లో భాగంగా ఐడ్రీమ్ ఛానల్తో మాట్లాడుతూ.. ఈ విషయమే విక్రమ్ గట్టిగా వ్యక్తం చేశాడు. దూత వెబ్ సిరీస్లో నాగచైతన్య పక్కన ముగ్గురు భామలు జత కడుతున్నారు. పార్వతీ తిరుమోతు, ప్రాచీ దేశాయ్, ప్రియ భవానీ స్పెషల్ క్యారెక్టర్స్ ని పోషిస్తున్నారు. ముగ్గురికీ ముగ్గురూ చాలా స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినవారే కావడం ముఖ్యమైన ఆకర్షణ. ముగ్గురూ సినిమాల్లో ఎంత ఫేమస్, ఎంత పాప్యులరో, బుల్లితెర మీద కూడా అంతే సెన్సేషన్లు.

విక్రమ్ ఆల్ లాంగ్వేజెస్ ప్రేక్షకుల్ని టార్గెట్ చేసి తమిళ, మళయాళ, హిందీ భాషలలో బాగా స్కోర్ చేసిన ముద్దుగుమ్మల్నే వెబ్ సిరీస్లోకి లాక్కొచ్చాడు. అయితే ముగ్గురు అమ్మాయిలున్నారు, ఇదెక్కడి రెగ్యులర్ లవ్ స్టోరీ అనిగానీ ప్రేక్షకులు అనుకుంటారేమో, అలా అనుకుంటే తన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైపోతుందని, తెలివైన విక్రమ్ వాళ్ళ గురించి చాలా ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అందించాడు. వాళ్ళకి తనే బదులిచ్చి మరీ వాళ్ళ పాత్రలకి వత్తాసు పలికాడు.

‘లవ్ గురించి మాత్రం నేను వాళ్ళని సెలెక్ట్ చేసుకోలేదు. వాళ్ళకి చాలా మంచి క్యారెక్టర్స్ రాశాను. కావాలంటే మీరే రేపు వెబ్ సిరీస్ స్ట్రీమ్ అయ్యాక చూడండి. ప్రేమించి, ప్రేమించి వాళ్ళు కూడా పూర్తిగా విసుగెత్తిపోయారు. ఏ సినిమా చూసుకున్నా సరే ఒకటే వరస. ప్రేమించడం, ప్రేమించడం. ఇంకేం పనిలేదండీ హీరోయిన్లకి? ప్రేక్షకులు మాత్రం ఎన్నాళ్ళు చూస్తారు ఈ గోల? కొత్తగా ప్రేమను చూపించడానికి ఏముంటుంది? పైగా ఈ రోజులు ఎలా ఉన్నాయి? ఆడపిల్లలు కూడా హయ్యర్ స్టడీస్ అని, హై రేంజ్ జాబ్లనీ, గ్రేట్ ఛాలెంజెస్ ముందు పెట్టుకుని ఎంతో బిజీ అయిపోయారు. అబ్బాయిల కన్నా కూడా వాళ్ళే చాలా ముందంజలో ఉంటున్నారు. ప్రేమించడానికి టైం లేనే లేదు లేటెస్ట్ ట్రెండ్స్ బట్టి చూస్తే. అందుకే ఇక ప్రేమకథలకి గుడ్ బై చెప్పాల్సిన రోజులొచ్చాయి. దూతలో మాత్రం వాళ్ళది లవర్ గర్ల్ పాత్రలు మాత్రమ కానేకావు.’’ అని బల్ల గుద్ది మరీ చెప్పుకొచ్చాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి