iDreamPost

మరో జన్మ ఉంటే.. డైరెక్టర్ సూర్య కిరణ్ మృతిపై చెల్లెలు నటి సుజిత ఎమోషనల్ పోస్ట్..!

Sujitha Dhanush Emotional Post:ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియో గ్రాఫర్ సూర్య కిరణ్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్ను మూసిన విషయం తెలిసిందే..

Sujitha Dhanush Emotional Post:ప్రముఖ నటుడు, దర్శకుడు, కొరియో గ్రాఫర్ సూర్య కిరణ్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్ను మూసిన విషయం తెలిసిందే..

మరో జన్మ ఉంటే.. డైరెక్టర్ సూర్య కిరణ్ మృతిపై చెల్లెలు నటి సుజిత ఎమోషనల్ పోస్ట్..!

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు సూర్య కిరణ్ సోమవారం చెన్నైలో కన్నుమూసిన విషయం తెలిసిందే. కొంత కాలంగా ఆయన పచ్చకామెర్లతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. బాల నటుడిగా మాస్టర్ సురేష్ పేరుతో కెరీర్ ప్రారంభించిన సూర్య కిరణ్ అంచెలంచెలుగా పైకి ఎదిగి దర్శకుడు, నటుడిగా మారారు. స్టార్ హీరోలతో దాదాపు 200 చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సోదరి సుజాత ధనుష్ కూడా నటి. తాజాగా తన అన్న మృతిపై ఎమోషనల్ పోస్ట చేశారు. వివరాల్లోకి వెళితే..

ప్రముఖ దర్శకుడు, నటుడు, కొరియో గ్రాఫర్, బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ సూర్య కిరణ్ అనారోగ్యంతో చెన్నైలో తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి ఇండస్ట్రీ ఒక్కసారే విషాదంలో మునిగిపోయింది. చిన్న వయసులోనే ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని దుఖాఃన్ని మిగిల్చిందని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. మాస్టర్ సురేష్ పేరుతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన సూర్య కిరణ్ తర్వాత రచయితగా పలు చిత్రాలకు కథలు అందించారు. తర్వాత దర్శకుడిగా మారి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. దర్శకుడిగానే కాకుండా నటుడిగా సత్తా చాటారు.  ఆయన సోదరి, ప్రముఖ నటి సుజాత ధనుష్ తన అన్నయ్య మరణంపై ఎమోషనల్ పోస్ట్ చేసింది.
SuryaKiran

‘అన్నయ్య రెస్ట్ ఇన్ పీస్.. నువ్వు నాకు అన్నయ్య మాత్రమే కాదు.. తండ్రి లాంటివి వాడివి, నా హీరో కూడా నువ్వే. నీ మాటలను, నీలో ఉన్న టాలెంట్ ని నేను ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటాను. మరో జన్మంటూ ఉంటే నువు కన్న కలలు నెరవేరాలని మనసారా కోరుకుంటున్నా’ అంటూ పోస్ట్ పెట్టారు. సూర్య కిరణ్ తో ఉన్న ఫోటోలో షేర్ చేసి ఎమోషన్ అయ్యారు. నటుడు, దర్శకుడిగా ఎంతో గొప్ప స్థానంలో ఉండాల్సిన సూర్య కిరణ్ జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. నటి కళ్యాణితో విడాకులు, సక్సెస్ లేక ఆర్ధిక కష్టాలు ఇలా ఎన్నో సమస్యలతో ఆయన డిప్రేషన్ లోకి వెళ్లి ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా సుజాత ధనుష్ పోస్ట్ వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Sujithar (@sujithadhanush)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి