iDreamPost
android-app
ios-app

దర్శకుడు శ్రీనువైట్ల ఇంట విషాదం!

  • Published Sep 14, 2023 | 12:19 PM Updated Updated Sep 14, 2023 | 12:19 PM
  • Published Sep 14, 2023 | 12:19 PMUpdated Sep 14, 2023 | 12:19 PM
దర్శకుడు శ్రీనువైట్ల ఇంట విషాదం!

ఇటీవల సినీ ఇండస్ట్రీలో ఎన్నో విషాదాలు జరుగుతున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక నిర్మాతలు.. ఇతర సాంకేతిక రంగానికి చెందిన ప్రముఖులు చనిపోవడంతో తీవ్ర విషాదం నెకొంటుంది. చిత్రపరిశ్రమకు చెందిన వారు అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, రోడ్డు ప్రమాదాలు, సరైన అవకాశాలు లేక డిప్రేషన్ లోకి వెళ్లి ఆత్మహత్యలకు పాల్పపడటం.. ఇలా ఎన్నో కారణాల వల్ల సెలబ్రెటీలు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు. కొంతమంది సెలబ్రెటీలు తాము ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న సాదు జంతువులు చనిపోతే విషాదంలో మునిగిపోతారు. తాజాగా ప్రముఖ డైరెక్టర్ శ్రీను వైట్ల ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు శ్రీను వైట్ల. 1999 లో నీకోసం మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత ‘ఆనందం’ సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. వెంకీ, ఢీ, దుబాయ్ శ్రీను, కింగ్, బాద్ షా లాంటి కల్ట్ కామెడీ సినిమాలతో వరుస విజయాలు అందుకున్నాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కి ‘దూకుడు’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ అందించారు. వరుస విజయాలతో దూసుపోతున్న సమయంలో ఆగడు, బ్రూస్ లీ లాంటి భారీ డిజాస్టర్స్ తో తీవ్ర నిరాశను కలిగించాయి. తాజాగా శ్రీను వైట్ల ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన ఎంతో ఇష్టంగా చూసుకుంటున్న ఆవు చనిపోయింది. ఈ సందర్భంగా ‘మా లక్ష్మీ చనిపోయింది’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. నా కూతుళ్లు ఆ ఆవును లక్ష్మీ అని ఎంతో ఆప్యాయంగా పిలిచేవారు. నేడు మా లక్ష్మికి సంపద్రాయంగా అంత్యక్రియలు చేయనున్నాం.. అంటూ ‘లక్ష్మి’ ఫోటోని పోస్ట్ చేశారు శ్రీనువైట్ల.

గత కొంత కాలంగా శ్రీను వైట్ల ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోని వరుస డిజాస్టర్స్ తో సతమతమవుతున్నారు. అందుకే ఈసారి కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మ్యాచో హీరో గోపీచంద్ తో ఒక మూవీ చేస్తున్నాడు. దీనికి సంబంధించి పూజా కార్యక్రమాలు ఈమద్యనే జరిగాయి. ఈ మూవీని చిత్రాలయం స్టూడియో నిర్మిస్తుంది. ఈ మూవీకి సంబంధించి షూటింగ్ త్వరలో మొదలు కాబోతుంది. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తే అటు హీరో గోపీ చంద్, దర్శకుడు శ్రీను వైట్ల మళ్లీ ఫామ్ లోకి వస్తారని కొండంత ఆశతో ఉన్నారు. తాజాగా శ్రీను వైట్ల చేసిన ట్వీట్ సోషల్ మీడతియాలో వైరల్ అవుతుంది.

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet