iDreamPost
android-app
ios-app

గేమ్ ఛేంజర్ కోసం శంకర్ భారీ ప్లాన్.. RRRకి మించిన క్లైమ్యాక్స్!

Ram Charan Game Changer: డైరెక్టర్ శంకర్- రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకి సంబంధించి ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. వాటిని రెట్టింపు చేస్తూ ఒక వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Ram Charan Game Changer: డైరెక్టర్ శంకర్- రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకి సంబంధించి ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. వాటిని రెట్టింపు చేస్తూ ఒక వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

గేమ్ ఛేంజర్ కోసం శంకర్ భారీ ప్లాన్.. RRRకి మించిన క్లైమ్యాక్స్!

ప్రస్తుతం రామ్ చరణ్ వరుస ప్రాజెక్టులతో బిజీ కాబోతున్నాడు. అయితే ఫ్యాన్స్ మాత్రం గేమ్ ఛేంజర్ గురించే ఎదురు చూస్తున్నారు. RRR తర్వాత వస్తున్న మూవీ కాబట్టి అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. పైగా డైరెక్టర్ శంకర్ ప్రాజెక్ట్ కావడంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్లు మూవీ నుంచి ఎలాంటి అప్ డేట్స్ లేవని ఎంతో బాధ పడ్డారు. కానీ, పుట్టిన రోజు సందర్భంగా కియారా అద్వానీతో స్టెప్పులేసిన జరగండి.. జరగండి సాంగ్ రిలీజ్ చేసి సంతోష పరిచారు. ఇప్పుడు ఈ మూవీ నుంచి క్రేజీ గాసిప్ ఒకటి టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఆ వార్త గేమ్ ఛేంజర్ మీద అంచనాలను అమాంతం పెంచేస్తోంది.

RRR మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ఇక నుంచి చెర్రీ నుంచి ఏ ప్రాజెక్ట్ అయినా మినిమం పాన్ ఇండియా లెవల్లో ఉండాలనే ఆడియన్స్ కూడా కోరుకుంటారు. ఆ అంచనాలకు తగినట్లుగానే రామ్ చరణ్ తన తర్వాతి ప్రాజెక్ట్ ను శంకర్ తో స్టార్ట్ చేశాడు. అయితే మూవీ పట్టాలెక్కాక ఏళ్లు గడిచినా అప్ డేట్స్ ఇవ్వకుండా కాస్త ఇబ్బంది పెట్టారు. కానీ, మూవీ మాత్రం ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా ఉంటుందని మాత్రం హామీ ఇస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన జరగండి సాంగ్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

డైరెక్టర్ శంకర్ సినిమా అంటే అందులో మినిమం కొన్ని విషయాలు తప్పకుండా ఉంటాయి. అవేంటంటే.. భారీ భారీ సెట్స్ లో సాంగ్స్, సోషల్ కాజ్ మీద హీరో పోరాడటం, భారీ భారీ యాక్షన్ సీక్వెన్సులు. ఇవి మాత్రం శంకర్ సినిమాలో తప్పకుండా ఉంటాయి. అదే విన్నింగ్ ఫార్ములాని చెర్రీ కోసం కూడా శంకర్ రిపీట్ చేస్తున్నారు. ఇప్పటికే జరగండి సాంగ్ చూస్తే ఈ మూవీలో కూడా సాంగ్స్ లో శంకర్ మార్క్ ఉంటుందని అర్థమైంది. అలాగే కరప్షన్, సోషల్ కాజ్ కోసం మూవీ అని ఇప్పటికే తెలిసి పోయింది. ఇప్పుడు భారీ యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించి ఒక క్రేజీ గాసిప్ నెట్టింట వైరల్ అవుతోంది.

విషయం ఏంటంటే.. గేమ్ ఛేంజర్ క్లైమ్యాక్స్ కోసం శంకర్ గట్టిగానే ప్లాన్ చేశారంట. ఏకంగా వెయ్యి మందితో క్లైమ్యాక్స్ ఫైట్ ప్లాన్ చేసినట్లు చెప్తున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ అంత మందితో పోరాటం చేయడం చూశాం. జక్కన్న దానిని ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. ఇప్పుడు శంకర్ అంతకు మించిన విధ్వంసం చేయడానిక రెడీ అయిపోయాడు అంటున్నారు. స్క్రీన్ మీద గేమ్ ఛేంజర్ సినిమా క్లైమ్యాక్స్ మొత్తం సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని చెప్తున్నారు. ఈ వార్త విన్న తర్వాత చెర్రీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఆలస్యం చేసిన ఇలాంటి అద్భుతాలతో ప్రేక్షకుల ముందుకు రావాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. గేమ్ ఛేంజర్ క్లైమ్యాక్స్ కి సంబంధించి వస్తున్న గాసిప్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaCasibom GirişMarsbahis GirişCasibom Girişenbet girişHoliganbet Giriş