iDreamPost

దర్శకేంద్రుల ఖరీదైన ప్రేమలేఖ

దర్శకేంద్రుల ఖరీదైన ప్రేమలేఖ

మాములుగా దిగ్గజాలు అనిపించుకున్న దర్శకులు హీరోలు హీరోయిన్ల మీద ఏదైనా పుస్తకం వచ్చినప్పుడు సినిమా ప్రేమికులకు సహజంగానే ఆసక్తి ఉంటుంది. వాటిలో మనకు తెలియని బోలెడు విషయాలు చెప్పి ఉంటారన్న ఉత్సుకత కలుగుతుంది. గతంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, కృష్ణ, విజయనిర్మల, దాసరి నారాయణరావు, బి నాగిరెడ్డి, చక్రపాణి, డివి నరసరాజు, కాట్రగడ్డ మురారి, పరుచూరి బ్రదర్స్ లాంటి వాళ్ళ మీద బోలెడు బుక్స్ వచ్చాయి. వాటిలో కొన్ని వాళ్లే రాసినవి ఉన్నాయి. అయితే దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి మీద ఇప్పటి దాకా ఏ పుస్తకం రాలేదు. మొదటిది నేను సినిమాకు రాసుకున్న ప్రేమలేఖ.

ఇటీవలే ఇది రిలీజయ్యింది. అయితే సామాన్యులకు అందుబాటులో లేని ధరలో ఏకంగా 5 వేల రూపాయలు నిర్ణయించారు. కొన్ని పుస్తక కేంద్రాల్లో డిస్కౌంట్ మీద 3500 దాకా విక్రయిస్తున్నారు. అయితే ఇందులో అంత స్పెషల్ ఏముందనే డౌట్ వచ్చిందా. అదేంటో చూద్దాం. సినిమా రివ్యూ స్టైల్ లో చెప్పాలంటే ఈ ప్రేమలేఖ గురించి వీలైనంత ఎక్కువ ఆశించకుండా చదవాలి. రాఘవేంద్రరావు సినిమాల గురించిన పూర్తి వివరాలు, వాటి లిస్టు, ఆయన జీవితంలో జరిగిన కీలక సంఘటనలు కానీ ఏమి లేవు. ఉన్న 180 పేజీల్లో చాలా మటుకు పర్సనల్ ఫోటోలు, కొత్త పెళ్లి సందడి గురించి విశేషాలు, ఫోటో షాప్ సరిగా చేయని పోస్టర్లు ఉన్నాయి.

కొన్ని మెచ్చుకోదగ్గ విశేషాలు ఉపమానాలు ఉన్నాయి కానీ ఇంత ధరకు న్యాయం చేసేవిగా అనిపించవు. అసలే టెక్నాలజీ వల్ల పుస్తకాలు కొనడం జనాలు మానేసిన ట్రెండ్ లో ఇంత రేట్ ఎందుకు పెట్టారో అర్థం కాదు. మంచి క్వాలిటీతో కలర్ మిక్సింగ్ తో అందంగా డిజైన్ చేయడం తప్పించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమి లేదు. రాఘవేంద్రరావు మీద విపరీతమైన అభిమానం ఉండి, అయిదు వేలు పెద్ద మొత్తం కాదనుకుంటే ఆయనకు గౌరవంగా కొనవచ్చు. మొత్తానికి ఇది అసంపూర్ణంగా ఉంది. ఇలా కాదు దర్శకేంద్రుల నుంచి ఆత్మకథ లాంటి ఒక గొప్ప పుస్తకం రావాలి. భవిష్యత్ దర్శకులకు ఒక దిక్సూచిలా ఉండాలి. అదెప్పుడు జరుగుతుందో.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి