iDreamPost
android-app
ios-app

OTTలోకి వచ్చేసిన దసరా నటుడి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT New Releases: ఓటీటీల్లో వారం వారం కొత్త కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. కానీ, కొన్ని మాత్రం ప్రేక్షకుల మైండ్ లో నుంచి పోవు. అలాంటి కోవకు చెందిన ఒక సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి.. ఆ మూవీ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూడండి.

OTT New Releases: ఓటీటీల్లో వారం వారం కొత్త కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. కానీ, కొన్ని మాత్రం ప్రేక్షకుల మైండ్ లో నుంచి పోవు. అలాంటి కోవకు చెందిన ఒక సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి.. ఆ మూవీ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూడండి.

OTTలోకి వచ్చేసిన దసరా నటుడి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తెలుగు ప్రేక్షకులకు న్యాచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఊరమాస్ యాక్టింగ్ తో నాని ఆ మూవీలో యాక్టింగ్ ఇరగదీశాడు. దసరా సినిమాలో నాని, కీర్తి సురేశ్ మాత్రమే కాకుండా.. ఇంకో హీరో కూడా ఉన్నాడు. అతనే దీక్షిత్ శెట్టి. ఈ కన్నడ కుర్రాడు దసరా మూవీతో తెలుగు ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు. ఒకానొక సీన్ లో నానీని కూడా డామినేట్ చేసినట్లు కనిపించాడు. ఇప్పుడు దీక్షిత్ శెట్టి ఒక మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. పైగా అది ఫస్ట్ మ్యూజికల్ సైన్స్ ఫిక్షన్ స్టోరీ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

దీక్షిత్ శెట్టి స్టోరీ సెలక్షన్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దసరా మూవీని సెలక్ట్ చేసుకున్నప్పుడే అతని జడ్జిమెంట్ కి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు ఈ మూవీతో కూడా ఆడియన్స్ నుంచి మన్ననలు పొందుతున్నాడు. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాకుండా.. మంచి ప్రశంసలు కూడా అందుకుంటోంది. ఆ మూవీ మరేదో కాదు.. బ్లింక్. అవును.. దీక్షిత్ శెట్టి- మందాత లీడ్ రోల్స్ ప్లే చేసిన బ్లింక్ మూవీ. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో మంచి మౌత్ టాక్ తో దూసుకుపోతోంది. మార్చి 8న మొదట కేవలం 50 థియేటర్లలోనే ఈ చిత్రం విడుదలైంది. ఆ తర్వాత మంచి టాక్ సొంతం కావడంతో థియేటర్ల సంఖ్యను భారీగా పెంచేశారు. అలాగే ఓటీటీలో కూడా మంచి టాక్ తో దూసుకుపోతోంది.

ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ బ్లింక్ మూవీ కన్నడ వర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. కానీ, అతి త్వరలోనే తెలుగు సహా అన్ని భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుందని చెప్తున్నారు. కథ పరంగా కూడా ఈ బ్లింక్ కు మంచి అప్లాజ్ లభించింది. మొట్ట మొదటి మ్యూజికల్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ కావడంతో ఆడియన్స్ బాగా ఎంగేజ్ అవుతున్నారు. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. పీజీలో ఫెయిలైన హీరో ఆ విషయాన్ని తల్లి దగ్గర దాచి పెడతాడు. ఏవేవో పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తూ కాలం గడిపేస్తూ ఉంటాడు. తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం.. మంచి జాబ్ చేయాలి అనుకుంటాడు.

హీరోకి తన తండ్రి గురించి ఒక రహస్యాన్ని తెలుసుకుంటాడు. దాంతో అతని జీవితమే తలకిందులు అయిపోతుంది. అంతేకాకుండా హీరోకి ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. అతను టైమ్ ట్రావెల్ చేయగలడు. అదే అతడికి లేనిపోని కష్టాలు తెచ్చిపెడుతుంది. మొత్తం 4 టైమ్ పిరియడ్స్ లో ఈ మూవీని చూపిస్తూ ఉంటారు. అసలు అతనికి ఆ శక్తి ఎలా వస్తుంది? టైమ్ ట్రావెల్ చేయడం వల్ల అతనికి వచ్చిన కష్టాలు ఏంటి? అసలు లైఫ్ లో సెటిల్ అయ్యాడా లేదా? అనేదే ఈ బ్లింక్ మూవీ కథ. మరి.. ఈ బ్లింక్ మూవీ చూసేస్తారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి