iDreamPost
android-app
ios-app

పవన్ 2 సినిమాలతో ఆపట్లేదా ?

  • Published Jan 30, 2020 | 5:35 AM Updated Updated Jan 30, 2020 | 5:35 AM
  • Published Jan 30, 2020 | 5:35 AMUpdated Jan 30, 2020 | 5:35 AM
పవన్ 2 సినిమాలతో ఆపట్లేదా ?

అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసిన పవన్ పింక్ రీమేక్ తో మళ్ళీ మేకప్ వేసుకోవడం పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తోంది. ఇంకా ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తుండగానే క్రిష్ డైరెక్షన్ లో మరో సినిమా మొదలుకావడంతో వాళ్ళ హుషారు మాములుగా లేదు. అయితే ఈ రెండు సినిమాలతో పవన్ సినీ ప్రయాణాన్ని ఆపేస్తాడా లేక కొనసాగిస్తాడా అనే అనుమానాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇంకో మూడేళ్ళ దాకా పవన్ వరసగా సినిమాలు చేసే ప్రణాళికతోనే ఉన్నట్టు తెలుస్తోంది.

అధికారికంగా చెప్పకపోయినా జరుగుతున్న పరిణామాలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. పింక్ రీమేక్ కు పవన్ చాలా తక్కువ డేట్స్ ఇచ్చాడు. ఎలాగూ బడ్జెట్ డిమాండ్ చేసే కథ కాదు కాబట్టి రెండు నెలల్లో షూటింగ్ పూర్తి చేసేలా పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. ఇక క్రిష్ సినిమా కూడా ఆపై మూడు నుంచి ఐదు నెలల్లోనే కంప్లీట్ చేసేలా మాట్లాడుకున్నారట. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి భారీ స్కేల్ ప్రాజెక్ట్ ని అతి తక్కువ టైంలో ఫినిష్ చేసి షాక్ ఇచ్చిన క్రిష్ కు ఇదేమి పెద్ద సమస్య కాదు

వీటి తర్వాత హరీష్ శంకర్ తో ఓ సినిమా ఉండొచ్చని తెలుస్తోంది. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తో తన స్టామినా చాటిన హరీష్ అంటే పవన్ కు ప్రత్యేకమైన సాఫ్ట్ కార్నర్ ఉంది. పలు ఇంటర్వ్యూలలో హరీష్ ఇది చెప్పుకొచ్చాడు కూడా. మరో మంచి మాస్ ఎంటర్ టైనర్ ని ఇతను సిధ్దం చేసే పనిలో ఉన్నట్టు తెలిసింది. దీని తర్వాత పవన్ మైత్రి మేకర్స్ కి ఇచ్చిన పాత కమిట్ మెంట్ ని పూర్తి చేయాలి. దానికి దర్శకుడు ఎవరో తెలియాల్సి ఉంది. ఈ లెక్కన ఈజీగా పవన్ నుంచి నాలుగు సినిమాలు ఆశించే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే జనసేన సంగతేమో కానీ మూవీస్ పరంగా పవన్ ఫ్యాన్స్ కు పండగే.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetjojobet girişdeneme bonusu veren sitelerMariobetmadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet