iDreamPost

‘ఢీ’ షోలో మైక్ విసిరేసి ఫైర్ అయిన జాని మాస్టర్.. ఎందుకంటే?

Jani Master Fire: తెలుగు బుల్లితెరపై ఇప్పటి వరకు ఎన్నో రియాల్టీ షోలు వచ్చాయి. అందులో ‘ఢీ’ షో అనేది ది బెస్ట్ డ్యాన్సింగ్ రియాల్టీ షోగా మంచి పేరు తెచ్చుకుంది.

Jani Master Fire: తెలుగు బుల్లితెరపై ఇప్పటి వరకు ఎన్నో రియాల్టీ షోలు వచ్చాయి. అందులో ‘ఢీ’ షో అనేది ది బెస్ట్ డ్యాన్సింగ్ రియాల్టీ షోగా మంచి పేరు తెచ్చుకుంది.

‘ఢీ’ షోలో మైక్ విసిరేసి ఫైర్ అయిన జాని మాస్టర్.. ఎందుకంటే?

ఇప్పటి వరకు ‘ఢీ’ డాన్సింగ్ రియాల్టీ షో ద్వారా ఎంతో మంది బెస్ట్ డ్యాన్సర్లుగా తమ సత్తా చాటుకుంటూ వచ్చారు. ప్రొఫెషనల్  కొరియోగ్రాఫర్స్, డ్యాన్సర్లుగా కెరీర్ కొనసాగిస్తున్నారు. డాన్సింగ్ విభాగంలో ఈ షో ఎంతోమందికి మంచి లైఫ్ ఇచ్చిందని చెబుతుంటారు. ఇటీవల ఢీ షోలో డాన్స్ తో పాటు కామెడీ పంచ్ డైలాగ్స్ ఆది, సుడిగాలి సుధీర్ మరికొంత మంది ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నారు. అప్పుడప్పుడు ఢీ షోలో ఎవరో ఒకరు అలగడం, ఫైర్ కావడం లాంటి కాంట్రవర్సీలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఢీ షో కి సంబంధించిన ప్రోమోలో జానీ మాస్టర్ ఫైర్ అవుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఎప్పుడూ కూల్ గా ఉంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఆయన కొరియోగ్రఫీ అంటే చాలా ఇష్టం. కొరియోగ్రఫితో పాటు డాన్సింగ్ షో లకు జడ్జీగా వ్యవహరిస్తుంటారు. ప్రస్తుతం ఢీ సెలబ్రెటీ సీజన్ లో జానీ మాస్టర్, గణేశ్ మాస్టర్ తో పాటు మాజీ హీరోయిన్ ప్రణిత సుభాష్ కూడా జడ్జీగా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ మొదలైనప్పుడు శేఖర్ మాస్టర్, ప్రణిత ఉండేవారు.  ప్రస్తుతం ఈ షోకి నందు, హైపర్ ఆది యాంకర్స్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా వచ్చే బుధవారం ఢీ షోకి సంబంధించిన ఓ ప్రోమో రిలీజ్ చేశారు.  ఈ ప్రోమోలో కంటెస్టెంట్స్ పై జానీ మాస్టర్ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మైక్ నేలకేసి కొట్టాడు. ఎప్పుడూ కూల్ గా ఉండే జానీ మాస్టర్ ఇంత ఫైర్ అయ్యాడేంటా? అని ప్రేక్షకులు షాక్ కి గురయ్యారు.

సాత్విక్, వర్షిణి ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ జోన్ లో ఉన్నారు. మిగిలిన కంటెస్టెంట్స్ వాళ్ళకి ఓటు వేయాలి. ఈ సందర్భంగా ఓటింగ్ విషయంలో జానీ మాస్టర్ సీరియస్ అయ్యాడు. అన్న చెప్పడం వల్లనే తాను అక్కకి ఓటు వేశానని ఓ కంటెస్టెంట్  చెప్పడంతో జానీ మాస్టర్ ఫైర్ అయ్యారు.  మీకు ఒక పవర్ ఇచ్చారంటే దాన్ని ప్రాపర్ గా సద్వినియోగం చేసుకోవాలి. మేం ఎర్రిపప్పల్లా కనిపిస్తున్నామా అంటూ బై బై అంటూ అక్కడ నుంచి ఆవేశంగో వెళ్లిపోయారు.  తర్వాత నందూ.. జాని మాస్టర్ కి సర్ధి చెప్పి స్టేజ్ వద్దకు తీసుకువచ్చాడు. అప్పుడు జానీ మాస్టర్ కంటెస్టెంట్స్ తో ఢీ షో అంటే మీకు ఆటగా ఉందా? వాడెవడో చెప్తే నువ్ ఓటు వేస్తావా? అంటూ తన చేతిలో ఉన్న మైక్ ని నేలమీదకేసి కోపంగా కొట్టాడు. అసలు మాట్లాడాలంటేనే నాకు ఎదోలా ఉంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఢీ హిస్టరీలో ఇలాంటి సీన్ ఎప్పుడూ జరగలేదని.. జానీ మాస్టర్ ని ఇంత కోపంగా ఎప్పుడూ చూడలేదని నెటిజన్లు అంటున్నారు. అయితే ఇది స్క్రిప్ట్ ప్రకారం నడిచిందా.. ప్రోమో లో కోసం ఇలా కట్ చేశారా? అన్న అనుమానాలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ ఎపిసోడ్ లో జానీ మాస్టర్ కంటిన్యూ అయ్యారా? లేదా వెళ్లిపోయాడా? అన్నది బుధవారం ఢీ షో చూసే వరకు ఆగాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి