iDreamPost

రేవంత్ కంటే KCR మేలు.. ఎంపీ అర్వింద్ కీలక వ్యాఖ్యలు!

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు.

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు.

రేవంత్ కంటే KCR మేలు.. ఎంపీ అర్వింద్  కీలక వ్యాఖ్యలు!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరింది. ఇక పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో నడుస్తోంది. గెలుపే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీల నేతలు ప్రత్యర్థులపై మాటల ఆస్త్రాలను సంధిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలపై గులాబీ బాస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా ఎంపీ, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కన్నా సీఎం కేసీఆర్ మేలు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన మాటలతో ప్రత్యర్థులపై విరుచకపడుతుంటారు. ఇక తాజా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. శనివారం ఎంపీ అర్వింద్‌ జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా అర్వింద్‌ మాట్లాడుతూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌ కంటే సీఎం కేసీఆర్‌ మేలని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్‌ పదేళ్ల పాటు తెలంగాణ కోసం పోరాడారని, కేసీఆర్ కొట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నాడని తెలిపారు. అంతేకాక రేవంత్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశాని,. ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నాడని వ్యాఖ్యానించారు చంద్రబాబు నాయుడుకు సంబంధించిన నాయకులంతా ఇప్పుడు కాంగ్రెస్‌లోనే ఉన్నారని అర్వింద్ అన్నారు. ఇంకా అర్వింద్ మాట్లాడుతూ..2018 ఎన్నికల్లో హైదరాబాద్ తానే కట్టానని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌కు ఓటు వేశారో తెలంగాణను తీసుకువెళ్లి ఆంధ్రాలో  ఉన్న టీడీపీచేతిలో పెట్టినట్టే అని  ప్రజలను ఉద్దేశించి సంచలన కామెంట్స్‌ చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణను హోల్ సేల్‌గా అమ్మేస్తాడని చంద్రబాబు కోసం సంచులను మోసుకెళ్లాడు అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. ఎంపీ ధర్మపురి అర్వింద్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే అర్వింద్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయండం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతేకాక రేవంత్‌ రెడ్డి కంటే సీఎం కేసీఆర్‌ మంచోడని అనడం చర్చనీయాంశంగా మారింది. గతంలోనే అర్వింద్‌ సీఎం కేసీఆర్‌పై ఇలాంటి వ్యాఖ్యలే చేసిన విషయం తెలిసిందే. మరి.. ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి