iDreamPost

OTT Movies: OTTలోకి వచ్చేస్తున్న సిద్ధార్ధ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Mar 20, 2024 | 4:02 PMUpdated Mar 20, 2024 | 4:02 PM

బాలనటుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు తిరిగి హీరోగా ఎంట్రీ ఇచ్చిన.. దీపక్ సరోజ్ సినిమా "సిద్ధార్ధ్ రాయ్".. థియేటర్స్ లో కుర్రాళ్లను ఉర్రుతలూగించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ కి రెడీ అయింది.

బాలనటుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు తిరిగి హీరోగా ఎంట్రీ ఇచ్చిన.. దీపక్ సరోజ్ సినిమా "సిద్ధార్ధ్ రాయ్".. థియేటర్స్ లో కుర్రాళ్లను ఉర్రుతలూగించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ కి రెడీ అయింది.

  • Published Mar 20, 2024 | 4:02 PMUpdated Mar 20, 2024 | 4:02 PM
OTT Movies: OTTలోకి వచ్చేస్తున్న సిద్ధార్ధ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇప్పుడు సినిమాలంటే అందరికి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఏ గుర్తొస్తున్నాయి. ఈ క్రమంలో థియేటర్ లో విడుదలైన సినిమాలు వరుసగా ఓటీటీలో ప్రత్యేక్షమవుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించి.. ఆ తర్వాత ఇప్పుడు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. వారిలో ఒకరు.. దీప‌క్ స‌రోజ్. చైల్డ్ ఆర్టిస్ట్ గా అత‌డు సినిమాలో కనిపించిన ఆ బాలుడు ఇప్పుడు.. “సిద్ధార్థ్ రాయ్” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా టీజర్, టైలర్ తోనే.. అర్జున్‌రెడ్డి, యానిమ‌ల్ సినిమాల‌ను గుర్తుచేసింది. దీనితో ఈ సినిమాపై అందరికి భారీ ఎక్స్పెక్టషన్స్ నెలకొన్నాయి. కాగా ఈ సినిమా ఫిబ్రవరి 23న థియేటర్ లో రిలీజ్ అయ్యి.. యావరేజ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు “సిద్ధార్ధ్ రాయ్” ఓటీటీలో విడుదలయ్యేందుకు రెడీ అయింది.

అయితే, గౌత‌మ‌బుద్దుడి జీవితం నుంచి స్ఫూర్తి పొందుతూ ద‌ర్శ‌కుడు ఈ మూవీ క‌థ‌ను రాసుకున్నట్లు .. డైరెక్టర్ తెలియజేశారు. అలాగే, ఇప్పుడున్న ట్రెండ్ కు తగినట్లుగ బోల్డ్ కంటెంట్ తో .. ఈ సినిమాను తెరకెక్కించారు. సిద్ధార్ధ్ రాయ్ సినిమాకు.. య‌శ‌స్వీ ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఇక ఈ సినిమాలో దీపక్ సరోజ్ కు జోడిగా.. త‌న్వినేగి హీరోయిన్‌గా న‌టించింది. మూవీ టీజర్, ట్రైలర్ లో హీరో లుక్స్, క్యారక్టరైజేషన్ కాస్త డిఫరెంట్ గా కనిపించడంతో.. తెలుగు ప్రేక్షకులలో .. ఈ సినిమాపై మరింత ఆసక్తి కలిగింది. కానీ, సినిమా విడుదలయ్యాక మాత్రం.. కానీ ఆ క్యూరియాసిటీని నిలబెట్టుకోలేకపోయింది. కానీ, నటన పరంగా హీరో తన క్యారక్టర్ కు మాత్రం ఫుల్ మార్క్స్ పడ్డాయి. ఇక “సిద్ధార్ధ్ రాయ్” సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్.. అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ సినిమా మార్చి 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో.. స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇక “సిద్ధార్ధ్ రాయ్” సినిమా కథ విషయానికొస్తే.. ఎలాంటి ఎమోషన్స్ లేకుండా.. తన అవసరాలు తీర్చుకునే క్యారెక్టరైజషన్ తో హీరో ఉంటాడు. సిద్ధార్ధ్ రాయ్ కేవలం లాజిక్స్ ప్రకారమే లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఇందు అనే అమ్మాయితో సిద్ధార్ధ్ కు పరిచయం ఏర్పడుతుంది. క్రమంగా వారిద్దరూ ప్రేమలో పడతారు. ఆ తర్వాత సిద్ధార్ధ్ లైఫ్ లో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. చాలా ప్రాక్టీకల్ గా, ఎమోషన్ లేకుండా బ్రతికే సిద్ధార్ధ్ తన ప్రేమలో సఫలం అవుతాడా లేదా ! చివరికి అసలు హీరో ఎమోషనల్ వాల్యూస్ కు ఇంపార్టెన్స్ ఇస్తాడా లేదా ! అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక ఓటీటీలో “సిద్ధార్ధ్ రాయ్” సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. మరి, “సిద్ధార్ధ్ రాయ్” సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి