iDreamPost

డేవిడ్ వార్నర్ న్యూ లుక్.. ఫ్యాన్స్​కు పెద్ద పరీక్షే పెట్టాడు!

  • Published Mar 02, 2024 | 10:07 PMUpdated Mar 02, 2024 | 10:07 PM

ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ న్యూ లుక్​లో మెరిశాడు. అయితే ఈసారి అభిమానులకు పెద్ద పరీక్షే పెట్టాడు డేవిడ్ భాయ్. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ న్యూ లుక్​లో మెరిశాడు. అయితే ఈసారి అభిమానులకు పెద్ద పరీక్షే పెట్టాడు డేవిడ్ భాయ్. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Mar 02, 2024 | 10:07 PMUpdated Mar 02, 2024 | 10:07 PM
డేవిడ్ వార్నర్ న్యూ లుక్.. ఫ్యాన్స్​కు పెద్ద పరీక్షే పెట్టాడు!

డేవిడ్ వార్నర్.. ఈ తరం చూసిన విధ్వంసక బ్యాటర్లలో ఒకడు. టెస్టులు, వన్డేలు, టీ20లు అనే తేడాల్లేకుండా ఏ ఫార్మాట్​లోనైనా ఒకేలా ఆడటం, బౌలర్లపై విరుచుకుపడటం, చూస్తుండగానే మ్యాచ్​ను ప్రత్యర్థి చేతుల్లో నుంచి లాగేసుకోవడం వార్నర్ స్టైల్. అందుకే అతడికి బౌలింగ్ చేసేందుకు తోపు బౌలర్స్ కూడా భయపడతారు. ఫస్ట్ బాల్​ నుంచే హిట్టింగ్​కు దిగే డేవిడ్​ భాయ్​ను ఆపకపోతే మ్యాచ్ ఫినిష్ అయిపోయినట్లే. టీ20ల ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వన్డేలు, టెస్టుల్లోనూ లెజెండ్​గా పేరు పొందాడు వార్నర్. ఆస్ట్రేలియాలో అతడికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అంతకు డబుల్ ఫాలోయింగ్ ఇండియాలో ఉంది. ఐపీఎల్ ద్వారా అందరికీ చేరువయ్యాడు. అలాంటి వార్నర్ తాజాగా న్యూ లుక్​లో దర్శనమిచ్చాడు.

టెస్టులు, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్.. కేవలం టీ20ల్లో మాత్రమే ఆడుతున్నాడు. కెరీర్ లాస్ట్ స్టేజ్​కు చేరుకోవడంతో గేమ్​ను మరింత ఎంజాయ్ చేస్తున్నాడు. అనవసర టెన్షన్ తీసుకోకుండా కూల్​గా ఆడుతున్నాడు. తన బ్యాటింగ్​తో పాటు స్టైల్, డ్యాన్సులతో ఆడియెన్స్​కు ఆనందాన్ని పంచుతున్నాడు. అలాంటోడు తాజాగా సరికొత్త లుక్​లోకి మారాడు. ఎప్పుడూ స్మార్ట్​గా కనిపించే డేవిడ్ భాయ్ ఈసారి గడ్డం బాగా పెంచి, నెత్తికి క్యాప్ పెట్టుకొని, వైట్ కలర్ టీషర్ట్​లో దర్శనమిచ్చాడు. ఆ షర్ట్‌ మీద ‘తెరా భాయీ సంభాల్ లేగా’ అని హిందీలో రాసి ఉంది. దీనికి నీ బ్రదర్ చూసుకుంటాడు అనేది అర్థం. త్వరలో ఐపీఎల్ స్టార్ట్ కానున్న నేపథ్యంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిట్స్ ఫ్యాన్స్​కు నేను చూసుకుంటా అంటూ భరోసా ఇచ్చాడు వార్నర్.

కొత్త లుక్​ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన వార్నర్ దీనికి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్​ను జోడించాడు. గడ్డం లుక్​లోనే ఉండమంటారా? గడ్డాన్ని మరింత పెంచమంటారా? అని అభిమానుల్ని అడిగాడు. దీంతో ఫ్యాన్స్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మామూలుగా కొంచెం గడ్డం, కొంచెం మీసంతో స్టైల్​గా కనిపించే వార్నర్.. ఇప్పుడు ఫుల్ గడ్డంతో ఊరమాస్​ లుక్​లోనూ అదరగొడుతుండటంతో వారికేమీ అర్థం కావడం లేదు. పాత లుక్​లోకి మారమని చెప్పాలా? లేదా గడ్డం లుక్ బాగుందని అనాలో అర్థం కాక తికమకపడుతున్నారు. కొందరు ఫ్యాన్స్ మాత్రం బాస్.. నువ్వు ఎలా ఉన్నా సూపర్​గా ఉంటావంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. వార్నర్ న్యూ లుక్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఐదో టెస్టుకు ముందు 10 రోజుల గ్యాప్.. బీసీసీఐ ఇలా చేస్తుందని ఊహించలేదు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి