iDreamPost

ఐదో టెస్టుకు ముందు 10 రోజుల గ్యాప్.. బీసీసీఐ ఇలా చేస్తుందని ఊహించలేదు!

  • Published Mar 02, 2024 | 7:57 PMUpdated Mar 02, 2024 | 7:57 PM

ఇంగ్లండ్​తో టెస్టు సిరీస్​లో ఆఖరి మ్యాచ్​కు ముందు ఏకంగా 10 రోజుల గ్యాప్ ఇచ్చారు. దీంతో బీసీసీఐపై విమర్శలు వస్తున్నాయి. బోర్డు ఇలా చేస్తుందని తాము ఊహించలేదని అంటున్నారు.

ఇంగ్లండ్​తో టెస్టు సిరీస్​లో ఆఖరి మ్యాచ్​కు ముందు ఏకంగా 10 రోజుల గ్యాప్ ఇచ్చారు. దీంతో బీసీసీఐపై విమర్శలు వస్తున్నాయి. బోర్డు ఇలా చేస్తుందని తాము ఊహించలేదని అంటున్నారు.

  • Published Mar 02, 2024 | 7:57 PMUpdated Mar 02, 2024 | 7:57 PM
ఐదో టెస్టుకు ముందు 10 రోజుల గ్యాప్.. బీసీసీఐ ఇలా చేస్తుందని ఊహించలేదు!

భారత్-ఇంగ్లండ్​ టెస్ట్ సిరీస్ ఫైనల్ స్టేజ్​కు చేరుకుంది. ఈ రెండు జట్లు 4 టెస్టులు ఆడేశాయి. ఇంక సిరీస్​లో లాస్ట్ మ్యాచ్ ఒక్కటే మిగిలి ఉంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత ఇరు జట్లలోని చాలా మంది ప్లేయర్లు ఐపీఎల్​తో బిజీ అయిపోతారు. దీంతో క్యాష్ రిచ్​ లీగ్​కు ముందు తమ ఫిట్​నెస్​, ఫామ్​ను మెరుగుపర్చుకునేందుకు ఈ మ్యాచ్​ను ఆటగాళ్లు ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే 3-1తో సిరీస్​లో లీడ్​లో ఉన్న రోహిత్ సేన ఆఖరి మ్యాచ్​లోనూ నెగ్గి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్​ పాయింట్స్ టేబుల్​లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని అనుకుంటోంది. వరుస ఫెయిల్యూర్స్​తో డీలాపడ్డ స్టోక్స్ సేన ఈ మ్యాచ్​లోనైనా నెగ్గి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది. అయితే ఐదో రోజు టెస్టుకు ముందు ఏకంగా 10 రోజుల గ్యాప్ ఇచ్చారు. ఆల్రెడీ రెండో టెస్టు తర్వాత ఇన్ని రోజుల గ్యాపే ఇచ్చారు. మళ్లీ ఇలాగే చేయడంతో బోర్డు మీద విమర్శలు వస్తున్నాయి.

సాధారణంగా టెస్టుల్లో మ్యాచ్​కు మ్యాచ్​కు మధ్య 4 నుంచి 5 రోజుల గ్యాప్ ఇవ్వడం కామన్. కానీ ఇంగ్లండ్​తో టెస్ట్​ సిరీస్​లో మాత్రం ఏకంగా 10 రోజుల గ్యాప్ ఇచ్చారు. రాజ్​కోట్​ టెస్ట్​తో పాటు ధర్మశాల టెస్టుకు ముందు ఈ గ్యాప్ వచ్చింది. రెండో మ్యాచ్ తర్వాత గ్యాప్ ఇస్తే ఆటగాళ్లు రెస్ట్ తీసుకుంటారు. మళ్లీ రీఫ్రెష్​గా గ్రౌండ్​లోకి అడుగు పెడతారని అనుకోవచ్చు. కానీ ఆఖరి మ్యాచ్​కు ముందు ఇంత గ్యాప్ ఇవ్వడం ఏంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. బోర్డు ప్లానింగ్​పై సోషల్ మీడియాలో భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బీసీసీఐ కావాలనే ఇలా చేసిందని నెటిజన్స్ అంటున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ ప్రీ వెడ్డింగ్ వేడుక కోసమే ఈ గ్యాప్ ఇచ్చారని కొందరు అభిప్రాయపడుతున్నారు.

అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్​కు కెప్టెన్ రోహిత్ శర్మ సహా చాలా మంది ప్లేయర్లు వెళ్లారు. దీంతో ఈ విమర్శలు స్టార్ట్ అయ్యాయి. బీసీసీఐ ప్లాన్ ప్రకారమే ఈ ఈవెంట్ కోసమే గ్యాప్ ఇచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ప్లేయర్లు మూడ్రోజుల పాటు ఈ ప్రోగ్రామ్​లో ఉండేందుకు ఇలా ప్లాన్ చేశారని అంటున్నారు. సిరీస్​లో క్రికెటర్లకు కావాల్సినంత రెస్ట్ దొరికిందని.. అయినా ఆఖరి మ్యాచ్​కు ముందు 10 రోజులు గ్యాప్ ఇవ్వడం కరెక్ట్ కాదని చెబుతున్నారు. మరికొందరు మాత్రం భారత్ ఆడే మ్యాచ్​లు ముందే షెడ్యూల్ అవుతాయని.. హఠాత్తుగా ఇలా ప్లాన్ చేయరని చెబుతున్నారు. కాగా, అనంత్ అంబానీ పెళ్లిలో రోహిత్​, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్​తో పాటు విండీస్ దిగ్గజం కీరన్ పొలార్డ్, భారత లెజెండ్ ఎంఎస్ ధోని తదితర క్రికెటర్లు పాల్గొన్నారు. మరి.. అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ఉండటం వల్లే ఆఖరి టెస్టుకు ఇంత గ్యాప్ ఇచ్చారనే అభిప్రాయాలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: IPL ముందు SRHకి భారీ షాక్! ఆ స్టార్ పూర్తిగా దూరం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి