iDreamPost

దంగల్ నటి మృతి.. షాకింగ్ విషయాలు వెల్లడించిన కుటుంబం!

Suhani Bhatnagar Succumbs To dermatomyositis: దంగల్ నటి సుహానీ భట్నాగర్ మృతితో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతి పట్ల కుటుంబం షాకింగ్ విషయాలు వెల్లడించింది.

Suhani Bhatnagar Succumbs To dermatomyositis: దంగల్ నటి సుహానీ భట్నాగర్ మృతితో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతి పట్ల కుటుంబం షాకింగ్ విషయాలు వెల్లడించింది.

దంగల్ నటి మృతి.. షాకింగ్ విషయాలు వెల్లడించిన కుటుంబం!

అమీర్ ఖాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన దంగర్ గురించి అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కు ఆడియన్స్ ఎంతో బాగా కనెక్ట్ అయిపోయారు. ఆ మూవీలో బబితా ఫోగట్ చిన్నప్పటి పాత్రలో నటించిన సుహానీ భట్నాగర్ తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆమె కేవలం 19 ఏల్ల వయసులోనే మరణించడం అందరినీ షాక్ కు గురి చేసింది. సుహానీ భట్నాగర్ మృతి పట్ల బాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అమీర్ ఖాన్ కూడా సుహానీ మృతి పట్ల ఎమోషనల్ అయ్యాడు. నువ్వు ఎప్పటికీ మా హృదయాల్లో ఒక స్టార్లా నిలిచిపోతావ్ అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ నటి మృతిపై చాలానే కారణాలు వినిపించాయి. కానీ, ఆమె మృతికి కారణమైన వ్యాధి గురించి కుటుంబం అసలు విషయాలు వెల్లడించింది.

సుహానీ భట్నాగర్ మృతికి మొదట అందరూ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ గా భావించారు. ఆమెకు కాలు విరిగినప్పుడు వాడిన మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఆమె మరిణించి అంటూ చెప్పుకొచ్చారు. కానీ, సుహానీ కుటుంబం ఆ వాదనను కొట్టిపారేశారు. వారి కుమార్తె మృతికి అరుదైన వ్యాధి కారణం అంటూ చెప్పుకొచ్చారు. అరుదైన ఇన్ఫ్లమేటరీ వ్యాధితో పోరాడుతూ సుహానీ భట్నాగర మృతి చెందిన విషయాన్ని తెలియజేశారు. కండరాల బలహీనతకు కారణమయ్యే ఇన్ఫ్లమేటరీ వ్యాధిగా చెప్పే డెర్మాటోమయోసిటిస్ వ్యాధితో పోరాడుతూ తుదిశ్వాస విడిచిందని వెల్లడించారు. ఆమెను ఫిబ్రవరి 7న ఈ వ్యాధి కారణంగానే ఎయిమ్స్ లో చేర్పించినట్లు తెలిపారు. ఆ వ్యాధికి చికిత్స పొందుతూ అది విషమించడంతోనే సుహానీ ప్రాణాలు కోల్పోయిందని తెలియజేశారు.

సుహానీ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు నెలల క్రితం ఈ వ్యాధి లక్షణాలు సుహానీలో కనిపించాయి. ఒంటిపై ఎర్రటి మచ్చలు రావడంతో ఎన్నో ఆస్పత్రులకు తిప్పారు. కానీ, ఎవ్వరూ ఈ వ్యాధి ఏంటి అనేది నిర్ధారణ చేయలేకపోయారు. ఇటీవల ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఎయిమ్స్ లో చేర్పించారు. కేవలం పదిరోజుల క్రితమే సుహానీకి ఈ ఇన్ఫ్లమేటరీ డెర్టాటోమయోసిటిస్ వ్యాధి నిర్ధారణ జరిగింది. ఆమె ఆరోగ్యంలో ఎలాంటి పురోగతి లేకపోగా.. మరింత క్షీణించింది. ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువయ్యి ద్రవాలు ఊపిరితిత్తుల్లోకి చేరుకుని లంగ్స్ కూడా దెబ్బతిన్నాయి. వైద్యులు ఆమెను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. కానీ, ఎలాంటి ఫలితం లేకుండా పోయిందంటూ సుహానీ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అరుదైన వ్యాధితో పోరాడుతున్న వాళ్లు ప్రపంచవ్యాప్తంగా కేవలం ఐదు నుంచి ఆరుగురు మాత్రమే ఉన్నారని వారు తెలిపారు. ప్రస్తుతం అందరూ అసలు ఈ డెర్మాటోమయోసిటిస్ అంటే ఏంటి అంటూ తెలుసుకోవడం ప్రారంభించారు.

డెర్మామయోసిటిస్ అంటే?:

ఈ అరుదైన వ్యాధి కండరాలు, చర్మం, అంతర్గత అవయవాస వాపుతో కూడినది. ఈ వ్యాధికి సకాలంలో చికిత్స అందిచకపోతే రోజు రోజుకీ ఆరోగ్యం క్షీణిస్తుంది. దీనిని ఆటో ఇమ్యూన్ పాథాలజీ అంటారు. అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ పని తీరులో ఆటంకాలు కారణంగానే ఈ వ్యాధి వస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అనేది మాత్రం ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. ఇప్పటికీ అది మిస్టరీగానే ఉండిపోయింది. రోగ నిరోధక వ్యవస్థ.. సొంత కణాలనే హాని కారకంగా భావిస్తూ వాటిని నిరోధించేందుకు ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. నెమ్మదిగా వాపునకు గురయ్యే వ్యాధి లక్షణాలు ప్రారంభమవుతాయి. కొన్ని సందర్భాల్లో ఇమ్యూనిటీ సిస్టమ్ అంతర్గత అవయవాలపై దాడి చేస్తాయి.

ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే.. త్వరగా అలసటకు గురి కావడం, జ్వరం రావడం జరుగుతుంది. వేగంగా బరువు తగ్గిపోతూ ఉంటారు. కండరాలు బాగా నొప్పికి గురిచేస్తూ ఉంటాయి. శ్వాస తీసుకోవడంలో బాగా ఇబ్బందిగా కూడా ఉంటుంది. చర్మం వాయడం, ఎర్రగా పొలుసుల మాదిరి మారడం జరుగుతూ ఉంటుంది. కంటి ప్రాంతంలో కూడా వాపు, ఎరుపు ఉంటుంది. అలాగే మెల్లకన్ను కూడా పడిపోయే ప్రమాదం ఉంటుంది. దీనికి సంబంధించిన చికిత్స విషయానికి వస్తే.. దీనికి క్యూర్ అంటూ ఏమీ ఉండదు. కార్టిసోన్ వంటి మందులు వాడాల్సి ఉంటుంది. కండరాలకు సంబంధించి ఫిజియోథెరపీ చేయిస్తూ ఉంటే వ్యాధి అదుపులో ఉండే ఆస్కారం ఉంటుంది. నటి సుహానీ భట్నాగర్ మృతికి కారణమైన ఈ అరుదైన వ్యాధిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి