iDreamPost

సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. ఐదు నెలల పసిపాప.. కానీ ఆ ఒక్క అలవాటు

మంచి ఉద్యోగం, అందమైన జీవితం, బంగారం లాంటి భార్య, వారి ప్రేమకు గుర్తుగా ముద్దులొలికే పాప. కానీ ఒకే ఒక్క అలవాటు అతడిని చేయరాని పని చేసేలా ప్రోత్సహించింది. అదే అతడి కొంపముంచింది. చివరకు ఆ అలవాటు..

మంచి ఉద్యోగం, అందమైన జీవితం, బంగారం లాంటి భార్య, వారి ప్రేమకు గుర్తుగా ముద్దులొలికే పాప. కానీ ఒకే ఒక్క అలవాటు అతడిని చేయరాని పని చేసేలా ప్రోత్సహించింది. అదే అతడి కొంపముంచింది. చివరకు ఆ అలవాటు..

సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. ఐదు నెలల పసిపాప.. కానీ ఆ ఒక్క అలవాటు

త్వరగా డబ్బులు సంపాదించి.. సెటిల్ అవ్వాలని అడ్డదారులు తొక్కుతున్నారు కొందరు. సామాన్యుడే కాదూ రూపాయిపై అవగాహన ఉన్నవాళ్లు, మంచి ఉద్యోగం, హోదాలో ఉన్న వ్యక్తులు కూడా అత్యాశకు పోయి.. కొన్నింటిల్లో అనవసరంగా డబ్బులు పెట్టి.. చేతులు కాల్చుకుంటున్నారు. దీని వల్ల అప్పులు పాలై.. పరువును నడి బజారుకు లాక్కుంటున్నారు. ఆ తర్వాత ఆత్మహత్యే శరణ్యమని బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి మరణాలకు కారణమౌతున్న అలవాట్లలో ఒకటి బెట్టింగ్. ఇటీవల బెట్టింగ్ యాప్స్ అంటూ కొన్ని వచ్చి.. మనిషిని తమ వైపు వశపరుచుకుంటున్నాయి. ఇందులో డబ్బులు పెడితే.. ప్రిడిస్షన్ కరెక్ట్ అయితే పెట్టిన దానికి డబుల్ అమౌంట్ వస్తుందని ఊహించి.. మొత్తం సొమ్మును అందులో పెడుతున్నారు.

నిండా మునిగిపోయిన తర్వాత.. ఇక తేలడం కష్టమౌతుంది. అప్పటికే లక్షలు రూపాయలు పోగొట్టుకోవడం, అప్పుల వాళ్లు ఇంటి మీదకు రావడంతో.. తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నారు. పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి కూడా దీనికే బలయ్యాడు. క్రికెట్‌లో బెట్టింగ్ కట్టి.. 40 లక్షలు నష్టపోయి.. చివరకు రైలు పట్టాలపై తనువు చాలించాడు ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలానికి చెందిన గంగి రెడ్డి సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఇటీవల వివాహమైంది. ఇతడికి ఐదు నెలల చిన్నారి ఉంది. జీవితం హాయిగా సాగిపోతున్న సమయంలో అతడికి ఉన్న ఓ చెడ్డ అలవాటు.. ప్రాణాలు తీసింది. క్రికెట్ బెట్టింగ్ కట్టి.. సుమారు రూ. 40 లక్షలు కోల్పోయాడు. అప్పు చేసి మరీ బెట్టింగ్స్ వేశాడు.

దీంతో అప్పులు ఇచ్చిన వారు అడగటం మొదలు పెట్టేసరికి.. ఏం చేయాలో తోచక.. భార్యను, పసి బిడ్డను వదిలేసి.. జిల్లాలోని సాతలూరు రైలు పట్టాలపై ఆత్మహత్యకు ఒడిగట్టాడు. రైలు వస్తుండగా.. గమనించి.. రైలు కింద పడి చనిపోయాడు. బెట్టింగ్ ఇతడి జీవితంతో పాటు అభం శుభం తెలియని ఐదు నెలల చిన్నారి లైఫ్‌ను కూడా అంధకారం చేసింది. ఈ బెట్టింగ్స్ కారణంగా అనేక మంది జీవితాలు దుర్భరంగా, దారుణంగా మారుతున్నాయని తెలిసినా కూడా వాటిల్లో పందాలు వేసి.. కొంప మీదకు, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కొందరు. అదొక వ్యసనంలా మారిపోయి.. డబ్బులు, ఆస్తులు, అంతస్తులు పొగొట్టుకున్న దాఖలాలు అనేకం ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి