iDreamPost

వాలంటీర్ దారుణ హత్య! రాత్రి బయటకు వెళ్లి!

వాలంటీర్ దారుణ హత్య! రాత్రి బయటకు వెళ్లి!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రజా సంక్షేమ పథకాలు లబ్దిదారులకు సకాలంలో, సజావుగా చేరవేసేందుకు వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. వాలంటీర్లను ఏర్పాటు చేసి.. వారి ద్వారా ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్దిదారులకు ఇంటి వద్దకే అందిస్తున్నారు. ఈ వ్యవస్థ ఏపీలో మంచి ఆదరణ లభిస్తోంది. వాలంటీర్ల సేవలను మెచ్చుకుంటున్నారు ప్రజలు. అయితే ఇటీవల కాలంలో వాలంటీర్లపై దాడులు పెరిగాయి. తాజాగా ఓ వాలంటీర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. మండగిరి గ్రామ పంచాయతీ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్‌కు చెందిన ఈరమ్మ కుమారుడు హరిబాబు భరత్ నగర్ వాలంటీర్‌గా వ్యవహరిస్తున్నాడు.

 బుధవారం రాత్రి 11 గంటల వరకు వినాయక విగ్రహ మండపాల దగ్గర ఉన్నఅతడు.. ఇంటికి వెళ్లిపోయాడు. నిద్రలోకి జారుకుంటుండగా ఫోన్ రావడంతో బయటకు వెళ్లిన వ్యక్తి మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. తల్లి లేచి చూసేసరికి కుమారుడు లేకపోవడం, ఇరుగు, పొరుగు అడిగినా తెలియదని చెప్పడంతో వెతకడం మొదలు పెట్టారు. ఇంటికి సమీపంలోని మారెమ్మవ్వ గుడి దగ్గర రక్తపు మడుగుల్లో పడి ఉన్నాడు హరిబాబు. కొడుకుని అలా చూసే సరికి ఒక్కసారిగా రోదించింది తల్లి. బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా.. తలపై తీవ్ర గాయాలున్నాయి. ఘటనా స్థలం నుండి హరిబాబు సెల్ ఫోన్, ఆనవాళ్లను సేకరించి, డాగ్ స్వ్కాడ్ ను రంగంలోకి దింపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. హరిబాబు తండ్రి పదేళ్ల  క్రితమే  చనిపోగా.. తల్లి కొడుకుపై గంపెడు ఆశలు పెట్టుకుని బతుకుతోంది. ఇలా అయ్యే సరికి తల్లి రోదన వర్ణనాతీతం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి