iDreamPost
android-app
ios-app

కాపురంలో చిచ్చు పెట్టిన జ్యోతిష్యం.. భార్య దారుణ నిర్ణయం

నమ్మకం.. అంధ విశ్వాసంగా మారకూడదు. కొంత మంది కొన్నింటిని బలంగా నమ్ముతూ ఉంటారు. అలాగే ఫాలో అవుతూ ఉంటారు. ముఖ్యంగా జ్యోతిష్యం, జాతకాలను విశ్వసించే వాళ్లు ఉన్నారు. జ్యోతిష్యులు చెప్పే మాటలను నమ్మి.. వారు చెప్పినట్లు చేస్తుంటారు. ఇప్పుడు..

నమ్మకం.. అంధ విశ్వాసంగా మారకూడదు. కొంత మంది కొన్నింటిని బలంగా నమ్ముతూ ఉంటారు. అలాగే ఫాలో అవుతూ ఉంటారు. ముఖ్యంగా జ్యోతిష్యం, జాతకాలను విశ్వసించే వాళ్లు ఉన్నారు. జ్యోతిష్యులు చెప్పే మాటలను నమ్మి.. వారు చెప్పినట్లు చేస్తుంటారు. ఇప్పుడు..

కాపురంలో చిచ్చు పెట్టిన జ్యోతిష్యం.. భార్య దారుణ నిర్ణయం

సైన్సు ఎంతగా అభివృద్ధి చెందుతున్నా.. అంధ విశ్వాసాలు మాత్రం హృదయాల్లో గూడు కట్టుకుని ఉన్నాయి. దెయ్యం, దేవుడు ఉన్నారా లేదా అనే సంగతి పక్కన పెడితే.. కొన్నింటిని బలంగా నమ్ముతున్నారు. అందులో ఒకటి జ్యోతిష్యం. జాతకాలను నమ్మే వ్యక్తులు చాలా మందే ఉన్నారు ఈ ప్రపంచంలో. ఏదైనా చేదు అనుభవం ఎదురైనా, ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా సమస్యలు వచ్చినా, కుటుంబ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న.. పరిష్కారం కోసం ముందుగా కలిసేది జ్యోతిష్యులేనే. వారు చెప్పినట్లు, వెనకా ముందు ఆలోచించకుండా చేసే వ్యక్తులు ఉన్నారు. అప్పటికి సంతృప్తి చెందకపోతే.. ఆర్థికంగా, మానసికంగా ఒత్తిడికి గురౌతున్నారు.

జ్యోతిష్యంపై నమ్మకం ఉండొచ్చు కానీ.. అంధ/మూఢ విశ్వాసంగా మారితే.. ఈ మహిళలాంటి పరిస్థితులను ఎదుర్కొవలసి ఉంది. జ్యోతిష్యాన్ని బలంగా నమ్మి.. భర్తకు తాను ఎక్కడ దూరమౌతానోనని భయపడ్డ ఓ ఇల్లాలు.. చివరకు ప్రాణాలు పోగొట్టుకుంది. వివరాల్లోకి వెళితే.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి రామకృష్ణ అలియాస్ రాముకు హైదరాబాద్ అంబర్ పేటకు చెందిన బబితతో ఐదేళ్ల క్రితం వివాహం జరగింది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ కుటుంబం మేడ్చల్ జిల్లా అల్వాల్ కానాజీ గూడ ఇందిరా నగర్‌లో నివాసముంటోంది. అయితే బబిత జ్యోతిష్యాన్ని బలంగా నమ్మేది. ఈ క్రమంలో యూట్యూబ్‌లో చెప్పిన జ్యోతిష్యాన్ని ఫాలో అవుతూ ఉండేది. అయితే తమ జాతకాల ప్రకారం భార్యా భర్తలు విడిపోతారని విన్న ఆమె.. భర్తతో తరచూ ఈ విషయంపై మాట్లాడేది.

జాతకాలు, జ్యోతిష్యాన్ని నమ్మవద్దని బబితకు చెప్పుకుంటూ వచ్చాడు భర్త. కానీ ఆమె మాత్రం వినకుండా ఆస్ట్రాలజీ నమ్ముతూ ఉండేది. ఈ క్రమంలో ఆదివారం కొడుకు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు ఆమె తల్లిదండ్రులు రాలేదు. సోమవారం ఉదయం రాము ఉద్యోగానికి వె ళ్లగా.. కుమారుడును అంగన్ వాడీ కేంద్రానికి పంపింది. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిన చిన్నారికి.. తల్లి ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని కనిపించడంతో ఏడ్చుకుంటూ వెళ్లి.. కింద పోర్షన్ లో ఉన్న వ్యక్తికి సమాచారం అందించాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

కూతురు బబిత చనిపోయిందని తెలిసే సరికి.. ఆమె తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని అల్లుడి రాముపై ఆరోపణలు చేశారు. అదనపు కట్నం కోసం వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. కాగా, జ్యోతిష్యాన్ని బబిత బలంగా నమ్మిందని, తాము ఇద్దరం విడిపోతామని పదే పదే చెప్పేదని, వాటిని నమ్మవద్దని చెప్పినట్లు రాము చెబుతున్నాడు. అయితే ఇదే విషయంపై వీరిద్దరి మధ్య గొడవ జరగడంతోనే మనస్థాపానికి గురై చనిపోయినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఏదీ ఏమైనప్పటికీ.. జ్యోతిష్యాన్ని నమ్మి.. మహిళ బలవన్మరణానికి పాల్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి