iDreamPost
android-app
ios-app

గుంటూరు నుండి గూడురు వెళ్లి.. ప్రియుడ్ని రప్పించి..

ఉన్నత చదువులు చదివి.. పది మందికి ఆదర్శంగా నిలుస్తారు అనుకుంటున్న తరుణంలో ప్రేమ వలలో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. భవిష్యత్తుపై అంచనాలు పెట్టుకున్నప్పటికీ.. వాటిని జయించడంలో అవరోధంగా మారుతుంది ప్రేమ.

ఉన్నత చదువులు చదివి.. పది మందికి ఆదర్శంగా నిలుస్తారు అనుకుంటున్న తరుణంలో ప్రేమ వలలో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. భవిష్యత్తుపై అంచనాలు పెట్టుకున్నప్పటికీ.. వాటిని జయించడంలో అవరోధంగా మారుతుంది ప్రేమ.

గుంటూరు నుండి గూడురు వెళ్లి.. ప్రియుడ్ని రప్పించి..

బిడ్డలపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలను పెట్టుకుని బతుకుతుంటారు. వారే పంచ ప్రాణాలుగా భావిస్తుంటారు. వారిని తిట్టినా, కొట్టినా సముదాయించేది పేరేంట్సే. పిల్లల కోసం కష్టపడుతుంటారు. బిడ్డలు ఏం చదవాలనుకుంటున్నారు, ఏం చేస్తే వారి భవిష్యత్తు బావుంటుందని ఆలోచించే తల్లిదండ్రులు.. ప్రేమ విషయానికి వచ్చేసరికి మాత్రం అంగీకరించలేకపోతున్నారు. పిల్లల మనస్సు తెలుసుకోకుండా కఠినంగా వ్యవహరిస్తుంటారు. దీంతో ప్రేమ విషయంలో తల్లిదండ్రులు విలన్లుగా మారిపోతున్నారు. కొంత మంది తల్లిదండ్రులకు చెప్పకుండానే.. వారి ప్రేమను కాదంటారన్న భయంతో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి తరహా ఘటనే తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా శ్రీ రుక్మిణీపురానికి చెందిన అన్నంగి పావని హోటల్ మేనేజ్ మెంట్ చేసింది. అయితే కోచింగ్ నిమిత్తం విజయవాడ రాగా, అక్కడ పశ్చిమ గోదావరి జిల్లా సగిపాడు గ్రామానికి చెందిన దండే రాకేష్‌తో ఆమెకు పరిచయమై.. ప్రేమగా మారింది. ఆ తర్వాత పావని తన స్వస్థలానికి వె ళ్లిపోయింది. ప్రస్తుతం రాకేష్ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. తిరుపతిలోని చిల్లకూరు మండలంలోని ఓ హోటల్లో పనిచేసేందుకు వెళుతున్నానని చెప్పిన పావని.. రెండు రోజుల క్రితం ఇక్కడకు వచ్చింది. రాకేష్‌కు ఫోన్ చేసి గూడూరు రావాలని పేర్కొంది. దీంతో అతడు ఆది వారం గూడురుకు వచ్చాడు. ఇద్దరు కలుసుకుని చాలా సేపు మాట్లాడుకున్నారు.

ఒక వేళ తమ ప్రేమను పెద్దలు అంగీకరించకపోతే.. బ్రతకడం వ్యర్థం అని భావించి తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. గూడురు రైల్వే స్టేషన్ నుండి సుమారు 3 కిలో మీటర్ల దూరంలో ఉన్న గాంధీ నగర్ ప్రాంతం వరకు ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్లి.. అక్కడ రైలు పట్టాలపై పడుకున్నారు. వారిపై నుండి రైలు వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందారు. ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది. వీరి మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరి గురించి ఆరా తీసి.. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మృతదేహాలను గుంటూరు ఆసుపత్రికి తరలించారు. ఇద్దర్ని విగతజీవులుగా చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. పేరేంట్స్ తమ ప్రేమను అంగీకరించరన్న కారణంగా ఆత్మహత్యలు చేసుకోవడం సరైన చర్య కాదు.