iDreamPost

ఏపీ ప్రభుత్వ బడులపై అంబటి రాయుడు ప్రశంసలు!

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన పథకాలు.. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవు. జగన్ పరిపాలన పై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా ఏపీ ప్రభుత్వ బడులు అద్భుతం అంటూ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కొనియాడారు.

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన పథకాలు.. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవు. జగన్ పరిపాలన పై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా ఏపీ ప్రభుత్వ బడులు అద్భుతం అంటూ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కొనియాడారు.

ఏపీ ప్రభుత్వ బడులపై  అంబటి రాయుడు ప్రశంసలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక పథకాలను ప్రవేశ పెట్టారు. అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా  చేయుత ఇచ్చేందుకు నవరత్నాల పేరుతో సంక్షేమ ఫలాలను అందిస్తున్నారు. అంతేకాక పేద పిల్లలకు అందించే ఆస్తి.. మంచి విద్యే అని బలంగా నమ్మిన వ్యక్తి సీఎం జగన్. అందుకే విద్యారంగలో అనేక సంస్కరణలు ప్రవేశ పెట్టారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశారు. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా సర్కార్ బడులను రూపొందించారు. అంతేకాక ప్రభుత్వ పాఠశాల్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టారు. ఇక విద్యారంగంలో సీఎం జగన్ తీసుకున్న చర్యలపై ఇతర రాష్ట్రాల సీఎంలు, ఇతర ప్రముఖులు ప్రశంస వర్షం కురిపించారు. తాజాగా టీమిండియా మాజీ  క్రికెటర్ అంబటి రాయుడు..ఏపీ ప్రభుత్వ పాఠశాలు అద్భుతం అంటూ ప్రశంసించారు.

శనివారం గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పర్యటించారు. నియోజవర్గంలోని సంగం జాగర్లమూడిలోని రైతు భరోసా కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ పాఠశాలనను రాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కార్పొరేట్ స్కూళ్ల కంటే ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని రాయుడు కొనియాడారు. విద్యార్థులు కూడా తమ భవిష్యత్తు బాగుంటుందని నమ్మకంతో ఉన్నారని తెలిపారు.

ఏపీలోని ప్రభుత్వ బడుల్లో ఉన్న సదుపాయాలు దేశంలో మరే రాష్ట్రంలో లేవన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో ఇచ్చే ఆహారం రుచికరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదుగుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తున్నాయని, వైద్య ఆరోగ్య రంగంలో ఏ రాష్ట్రం మన రాష్ట్రంతో సరితూగలేదని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని రాయుడు తెలిపాడు. అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమమని కొనియాడారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా పేదవాళ్లకు ఇంటి వద్దకే వైద్యులు వచ్చి.. చికిత్స అందిస్తున్నారని తెలిపారు.  అదే  విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు సంక్షేమ పథకాలతో ప్రజలంతా ఆనందంగా ఉన్నారని అంబటి రాయుడు అన్నారు.

ఏపీ ప్రభుత్వం విద్యా, వైద్య రంగంలో అనేక సంస్కరణలు చేపట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విద్యా రంగంలో నాడు-నేడు, అమ్మఒడి,  జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలను ప్రవేశ పెట్టారు. అంతేకాక పేద విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటకం కలగకుండ జగన్ సర్కార్ అనేక చర్యలు తీసుకుంది. ప్రభుత్వం పాఠశాలలో అనేక సౌకర్యాలు కల్పించి.. ప్రైవేటు స్కూల్ కు పోటీగా నిలిపారు.  వైద్య రంగ విషయానికి వస్తే.. పేదల చికిత్స ఖర్చు ప్రభుత్వానిదే అన్నట్లు జగన్ సర్కార్ అనేక కార్యక్రమాలు చేపట్టింది.  ఇంటింటికి వైద్యులను పంపి.. ప్రజల ఆరోగ్య విషయాలను తెలుసుకుని, అవసరమైన చికిత్స అందిస్తుంది. ఇలా అద్భుతమైన పథకాలతో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి