iDreamPost
android-app
ios-app

అనుష్క- క్రిష్ మూవీ స్టోరీ లీక్స్.. యధార్థ ఘటనల ఆధారంగా..!

  • Published Feb 12, 2024 | 10:06 PM Updated Updated Feb 12, 2024 | 10:06 PM

Anushka- Director Krish: అనుష్క శెట్టి- డైరెక్టర్ క్రిష్ కాంబోలో మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఒక క్రేజీ వార్త తెగ వైరల్ అవుతోంది.

Anushka- Director Krish: అనుష్క శెట్టి- డైరెక్టర్ క్రిష్ కాంబోలో మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఒక క్రేజీ వార్త తెగ వైరల్ అవుతోంది.

  • Published Feb 12, 2024 | 10:06 PMUpdated Feb 12, 2024 | 10:06 PM
అనుష్క- క్రిష్ మూవీ స్టోరీ లీక్స్.. యధార్థ ఘటనల ఆధారంగా..!

టాలీవుడ్ లో అనుష్క శెట్టికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఒక సరైన సినిమాతో అనుష్క ప్రేక్షకులను పలకరించి చాలా రోజులే అవుతోంది. ఇటీవల వచ్చిన మిస్ శెట్టి- మిస్టర్ పోలిశెట్టి మూవీకి ఆడియన్స్ నుంచి ఊహించిన స్థాయిలో స్పందన అయితే రాలేదు. నిజానికి ఆ మూవీ అనుష్కకు సెకండ్ డెబ్యూగా భావించారు. కానీ, ఎక్కడో ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కాలేదు. అందుకే ఇప్పుడు యూవీ క్రియేషన్స్ మళ్లీ ఆ బాధ్యతను తీసుకుని.. స్వీటీకి మంచి కంబ్యాక్ ప్లాన్ చేస్తున్నారు. ఒక చిన్న గాసిప్ కూడా లేకుండా ఆ మూవీ సెట్స్ మీదకు వెళ్లిపోయింది. నిజానికి అనుష్క- క్రిష్- యూవీ క్రియేషన్స్ అందరినీ సర్ ప్రైజ్ చేశారనే చెప్పాలి. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ గాసిప్ ఒకటి వైరల్ అవుతోంది.

అనుష్క- క్రిష్ కాంబోలో సినిమా రాబోతోంది అనే వార్త జనాల్లోకి వచ్చేలోపే.. వాళ్లు సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఒక మంచి లేడీ ఓరియంటెడ్ మూవీలో అనుష్క చేస్తోంది అంటూ సినిమా వర్గాల్లో చర్చ అయితే జోరుగా సాగుతోంది. ఈ మూవీకి సంబంధించి కొన్ని సీన్స్ కూడా షూట్ చేశారు అని చెబుతున్నారు. ఇప్పుడు ఏకంగా స్టోరీ లైన్ కూడా చెప్పేస్తున్నారు. అనుష్కా శెట్టి కొత్త సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు గానీ.. వాళ్లు చెబుతున్న లాజిక్ మాత్రం నమ్మశక్యంగానే ఉంది. ఇటీవల ఆంధ్రా- ఒడిశా బోర్డర్ లో అనుష్క- క్రిష్ మూవీ షూటింగ్ జరిగింది అంటున్నారు.

అలాగే ఇటీవల ఒక హోటల్ నుంచి అనుష్క వస్తున్న వీడియో కూడా వైరల్ అయ్యింది. ఆ వీడియో ఎక్కడా అని ఆరా తీయడం స్టార్ట్ చేస్తే అది ఒడిశా అని తెలిసిందంట. అలాగే ఒడిశా బోర్డర్ లో షూట్ అనగానే ఇప్పుడు వీటన్నింటిని ముడిపెడుతూ ఒక స్టోరీ లైన్ చెప్తున్నారు. ఒడిశాలోని ఒక లేడీ జీవితంలో జరిగిన యధార్థ ఘటన ఆధారంగా క్రిష్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కూడా ఒడిశాలోనే జరుగుతోంది. కాబట్టి ఈ వార్తలకు బలం చేకూర్చినట్లు అవుతోంది. అలాగే తొలి షెడ్యూల్ ని ఒడిశాలో చేయడానికి కూడా కారణం అదే అంటున్నారు. ఈ షెడ్యూల్ లోనే అనుష్కకు సంబంధించిన కీలక సీన్స్ షూట్ చేస్తున్నారంట. ఈ సినిమా కథ కనీసం పదేళ్లకు ముందు జరిగిన ఘటనల ఆధారంగా తెరెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీలో రాష్ట్రం పేరు ఒరిస్సా అని ఉంటుంది అంటున్నారు. అంటే ఒరిస్సాని ఒడిశాగా మార్చక ముందు జరిగిన ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు టాక్ స్టార్ట్ అయ్యింది. ఇవన్నీ చూస్తే.. అనుష్క- క్రిష్ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. సాధారణ కథలనే అద్భుతంగా తెరకెక్కించే క్రిష్.. యధార్థ ఘటనల ఆధారంగా అంటే ఒక రేంజ్ లో ఉండబోతోంది అంటున్నారు. పైగా లీడ్ రోల్ చేస్తోంది అనుష్క కాబట్టి యాక్టింగ్ విషయంలో ఎక్కడా తగ్గదు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ స్టోరీ లీక్స్, అప్ డేట్స్, గాసిప్స్ చూస్తుంటే స్వీటీ నుంచి అదిరిపోయే సినిమా రాబోతోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.. అనుష్క- క్రిష్ కాంబోలో వస్తున్న మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet