iDreamPost

పరాయి మగాడికి భార్యను అద్దెకు ఇస్తారు.. ఎక్కడో కాదు మనదేశంలోనే!

ఇల్లు, షాపులు, మోటార్ సైకిళ్ళు, కార్లు అద్దెకివ్వడం గురించి విన్నాం. కానీ భార్యలను, కూతుర్లను అద్దెకివ్వడం గురించి విన్నారా? వినకపోతే కనుక ఈ కథ తెలిస్తే మీరు షాక్ అవుతారు. సినిమాని మించిన స్టోరీ ఇది.

ఇల్లు, షాపులు, మోటార్ సైకిళ్ళు, కార్లు అద్దెకివ్వడం గురించి విన్నాం. కానీ భార్యలను, కూతుర్లను అద్దెకివ్వడం గురించి విన్నారా? వినకపోతే కనుక ఈ కథ తెలిస్తే మీరు షాక్ అవుతారు. సినిమాని మించిన స్టోరీ ఇది.

పరాయి మగాడికి భార్యను అద్దెకు ఇస్తారు.. ఎక్కడో కాదు మనదేశంలోనే!

కార్లు అద్దెకివ్వడం గురించి విన్నాం. ఇల్లు అద్దెకు ఇవ్వడం విన్నాం. ఎండాకాలంలో ఏసీలను అద్దెకివ్వడం విన్నాం. పెళ్ళిళ్ళకి టెంట్లు, వంట సామాన్లు అద్దెకు ఇవ్వడం విన్నాం. కానీ భార్యను రెంట్ కి ఇవ్వడం గురించి విన్నారా? పరాయి మగాడికి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు అద్దెకు ఇస్తారు. ఇదేదో సినిమా స్టోరీ అనుకుంటున్నారా? కానీ కాదు. ఇది నిజంగానే నిజం. ఈ కల్చర్ ఎక్కడో విదేశాల్లో ఉన్నది కాదు.. మన దేశంలోనే ఉన్న కల్చర్. తీస్తే బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. కానీ అక్కడ ఆడవాళ్ళ జీవితాలు మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. మరి ఈ ప్రాక్టీస్ ఎక్కడ కొనసాగుతుందో తెలుసా? మధ్యప్రదేశ్ లోని శివపురిలో భార్యలను పరాయి మగాళ్ళకి అద్దెకు ఇస్తారు. ఒక నెల లేదా ఒక ఏడాదికి అద్దెకు ఇస్తారు. ధనవంతులకి వధువు దొరక్కపోతే ఇలా అద్దెకు వేరొకరి భార్యలను తీసుకుంటారు.

దీని కోసం ఒక సంత నిర్వహిస్తారు. సంతలో పశువులను అమ్మినట్టు అమ్మాయిలని, ఆడవారిని అద్దెకు ఇస్తారు. పరాయి వ్యక్తి నుంచి డబ్బులు తీసుకున్న భర్త.. తన భార్యను కాంట్రాక్ట్ మీద ఆ వ్యక్తితో పంపిస్తాడు. ఈ క్రమంలో భార్య, పరాయి వ్యక్తి ఇద్దరూ ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. 10 రూపాయల నుంచి 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఈ ఒప్పందం చేసుకుంటారు. ఆ స్టాంప్ పేపర్ ని అద్దెకు ఇచ్చిన ఆవిడకు ఇవ్వడం వల్ల ఆమెను తిరిగి మళ్ళీ యజమాని అంటే భర్త కొనుక్కునే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయాక ఆ ఇల్లాలి మీద ఓనర్ షిప్ అనేది మళ్ళీ ఎవరైతే ఎక్కువ డబ్బు చెల్లిస్తారో వారికి వెళ్ళిపోతుంది. లేదా అంతకు ముందు అద్దెకు తీసుకున్న వ్యక్తే ఎక్కువ డబ్బు చెల్లించి కాంట్రాక్ట్ ని రెన్యూవల్ చేయించుకోవచ్చు.

అయితే ఇక్కడ ఆవిడ ఏ సమయంలో అయినా కాంట్రాక్ట్ ని రద్దు చేసుకోవచ్చు. అందుకోసం మహిళ అఫిడవిట్ ఇవ్వాలి. ఆ తర్వాత ఆమె తిరిగి తన భర్తకు ఇవ్వబడుతుంది. అయితే ఇక్కడ మహిళ వేరొక వ్యక్తి నుంచి ఎక్కువ డబ్బు ఆశించడం ఒప్పంద ఉల్లంఘన అవుతుంది. ఒప్పందంలో భాగంగా ఒక మహిళను అద్దెకు తీసుకున్నాక కాంట్రాక్ట్ పీరియడ్ తర్వాత కూడా ఆమెతోనే కొనసాగాలంటే అదనంగా కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. పొలం కౌలుకు తీసుకున్న వ్యక్తులకు కూడా కౌలు పన్ను కట్టలేక భార్యలను అద్దెకిచ్చే వ్యక్తులున్నారు. ఇక్కడ 10 రూపాయల నుంచి వంద రూపాయలకి కూడా భార్యలను అద్దెకు ఇస్తారు. పెళ్ళైన అమ్మాయిలనే కాదు.. పెళ్లి కాని అమ్మాయిలను కూడా తల్లిదండ్రులు వేరొకరికి అద్దెకి ఇస్తారు. మైనర్ అమ్మాయిలకి, పెళ్లి కాని అమ్మాయిలకు అక్కడ డిమాండ్ ఎక్కువ. పెళ్లైన వారి కంటే కూడా 8 నుంచి 15 ఏళ్ల వయసున్న అమ్మాయిలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

గంటకి, రోజుకు, నెలకు, ఏడాదికి ఇంత అని చెప్పి ధర నిర్ణయిస్తారు. 15 వేల నుంచి 25 వేల మధ్య ఒప్పందం అనేది కుదుర్చుకుంటారు. ఎంత వయసు తక్కువ ఉంటే అంత ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తారు కుటుంబ సభ్యులు. ఆ అమ్మాయి అందంగా ఉంటే ఒక్కోసారి 2 లక్షలకు కూడా పోతుంది ఆమె ధర. అది కూడా కన్య అయితేనే. ఒకవేళ కన్య కాని అమ్మాయి అయితే 10 వేల నుంచి 15 వేలు పలుకుతుంది. అది కూడా వారి స్కిన్ కలర్ బాగుండి.. ఎంత తక్కువ మందితో గడిపారు అన్న అంశం మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ పేదరికం, చదువు లేకపోవడం, ధనవంతులకు వధువులు దొరకపోవడం వంటి కారణాల వల్ల ఈ కల్చర్ అనేది కొనసాగుతుంది.  ఇంత జరుగుతున్నా పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అని అంటే.. అక్కడ ఎవరు కూడా దీని మీద ఫిర్యాదులు చేయలేదు. అక్కడ ఒక బిజినెస్ లా జరుగుతుంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుని అక్కడి వారికి ఉపాధి అవకాశాలు, విద్య ఆవశ్యకత వంటివి కల్పిస్తుందో లేదో చూడాలి. ఈ కథనాన్ని షేర్ చేసి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి