iDreamPost

కేరళ 5 ఏళ్ల చిన్నారి ఘటన.. ఈ నిందితుడికి క్షమాభిక్ష అవసరం లేదన్న కోర్టు!

గత నాలుగు నెలల కిందట కేరళలోని ఓ 5 ఏళ్ల చిన్నారిని దుండుగుడు అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసిన ఘటన తెలిసిందే. ఈ కేసును విచారించిన న్యాయస్థానం చిల్డ్రన్స్ డే రోజు సంచలన తీర్పును వెలువరించింది.

గత నాలుగు నెలల కిందట కేరళలోని ఓ 5 ఏళ్ల చిన్నారిని దుండుగుడు అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసిన ఘటన తెలిసిందే. ఈ కేసును విచారించిన న్యాయస్థానం చిల్డ్రన్స్ డే రోజు సంచలన తీర్పును వెలువరించింది.

కేరళ 5 ఏళ్ల చిన్నారి ఘటన.. ఈ నిందితుడికి క్షమాభిక్ష అవసరం లేదన్న కోర్టు!

గత కొన్ని నెలల కిందట కేరళలోని ఓ ప్రాంతంలో ఓ దుండగుడు ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. అభం, శుభం తెలియని ఓ 5 ఏళ్ల చిన్నారిని అత్యాచారం చేసి ఆ తర్వాత హత్యకు పాల్పడ్డాడు. అప్పట్లో ఈ దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. దీంతో బాధిత చిన్నారి తల్లిదండ్రులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక సుధీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం ఈ కేసుపై చిల్డ్రన్స్ డే రోజు సంచలన తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పుతో బాధిత చిన్నారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం గెలిచిందని సంతోషపడ్డారు.

 అసలేం జరిగిందంటే?

పూర్తి వివరాల్లోకి వెళ్లే.. బీహార్ కు చెందిన ఓ దంపతులు కేరళలోని అలువాలో నివాసం ఉండేవారు. వీరికి 5 ఏళ్ల కూతురు ఉంది. వీరు స్థానికంగా పని చేస్తూ జీవితాన్ని గడిపేస్తున్నారు. అయితే ఇదే చిన్నారిపై ఇక్కడే ఉండే అష్ఫక్ అలమ్ అనే వ్యక్తి కన్నేశాడు. ఆ పాపను కిడ్నాప్ చేయాలని అనుకున్నాడు. ఇక అనుకున్నట్లుగానే.. ఆ నిందితుడు జూలై 28న ఆ చిన్నారికి చాక్లేట్లు ఆశ చూపి ఓ చోటుకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత అభం, శుభం తెలియని ఆ పసిబిడ్డపై ఈ కిరాతకుడు అత్యాచారం చేశాడు. ఇంతటితో సరి పెట్టకుండా ఆ చిన్నారిని అష్ఫక్ అలమ్ గొంతు పసికి దారుణంగా హత్య చేశాడు.

అనంతరం ఆ బాలిక మృతదేహాన్ని ఓ గోనె సంచిలో ఉంచి స్థానికంగా ఉన్న ఓ చెత్త డంప్ లో పడేసి వెళ్లిపోయాడు. ఉన్నట్టుండి కూతురు కనిపించకపోవడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు అంతటా వెతికారు. కానీ, ఆ బాలిక ఆచూకి మాత్రం దొరకలేదు. ఇక చేసేదేం లేక మరుసటి రోజు ఆ చిన్నారి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కనిపించకుండపోయిన ఆ పాప కోసం అంతటా వెతికారు. ఈ క్రమంలోనే ఆ చిన్నారి మృతదేహం ఓ చెత్త డంపింగ్ లో కనిపించింది. దీన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ పాప మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఇక వైద్యులు అన్ని పరీక్షలు జరపగా.. ఆ చిన్నారిపై అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశారని రిపోర్టులో తేలింది. ఈ విషయం తెలుసుకుని ఆ మృతురాలి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇక ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఆ నిందితుడు అష్ఫక్ అలమ్ ను అరెస్ట్ చేశారు. ఈ కేసును 110 రోజుల పాటు సుధీర్ఘంగా విచారించిన ఎర్నాకులం ఫోక్సో కోర్టు మంగళవారం సంచలన తీర్పును వెలువరించింది. న్యాయమూర్తి కె. సోమన్ మాట్లాడుతూ.. ఇది అత్యంత అరుదైన కేసు. ఈ నిందితుడికి ఎటువంటి క్షమాభిక్ష అవసరం లేదని, ఇటువంటి నిందితుల వల్ల సమాజానికే సమస్య అని చెబుతూ నిందితుడు అష్ఫక్ అలమ్ కు మరణ శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పుతో మృతురాలి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో ఈ కేసు సంచలనంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి