iDreamPost
android-app
ios-app

నలుగురు పిల్లలు ఉన్నా.. ప్రేమ కరువై..

వైఎస్సార్‌ జిల్లా చెన్నూరుకు చెందిన కొర్రపాటి రవి శంకర్‌ ఆచారి, సరస్వతమ్మ భార్యా భర్తలు. వీరికి నలుగురు సంతానం. వారిలో ఇద్దరు అమ్మాయిలు కాగా.. ఇద్దరు అబ్బాయిలు.

వైఎస్సార్‌ జిల్లా చెన్నూరుకు చెందిన కొర్రపాటి రవి శంకర్‌ ఆచారి, సరస్వతమ్మ భార్యా భర్తలు. వీరికి నలుగురు సంతానం. వారిలో ఇద్దరు అమ్మాయిలు కాగా.. ఇద్దరు అబ్బాయిలు.

నలుగురు పిల్లలు ఉన్నా.. ప్రేమ కరువై..

కొడుకుల్ పుట్టరటంచు నేడ్తు రవివే / కుల్ జీవనభ్రాంతులై!
కొడుకుల పుట్టరె కౌరవేంధ్రునకనే / కుల్,వారిచే నేగతుల్
పడసెన్? పుత్రులులేని యా శకునకున / వాటిల్లెనే దుర్గతుల్
చెడునే మోక్షపదం బపుత్రకునకున్ / శ్రీకాళహస్తీశ్వరా!

ఈ పద్యానికి అద్దం పట్టేలాంటి సంఘటన ఒకటి వైఎస్సార్‌ జిల్లాలో చోటుచేసుకుంది. నలుగురు పిల్లలు ఉన్నా ఓ జంట ప్రేమకు నోచుకోలేకపోయింది. పిల్లలు తమ మాట వినకపోవటం.. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించటం వారి మనసును తీవ్ర మనోవేధనకు గురిచేసింది. దీంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. ఆ విషయం తెలిసిన కొన్ని నిమిషాల్లోనే భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కన్నీళ్లు పెట్టిస్తున్న ఈ యథార్థ కథకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

వైఎస్సార్‌ జిల్లా చెన్నూరుకు చెందిన కొర్రపాటి రవి శంకర్‌ ఆచారి, సరస్వతమ్మ భార్యా భర్తలు. వీరికి నలుగురు సంతానం. వారిలో ఇద్దరు అమ్మాయిలు కాగా.. ఇద్దరు అబ్బాయిలు. పెద్ద కూతురు కొన్నేళ్ల క్రితం ఇష్టం లేని పెళ్లి చేసుకుని దూరంగా వెళ్లిపోయింది. తర్వాత కుటుంబంతో కలిసిపోయింది. అయినప్పటికి రవి, సరస్వతమ్మలు మాత్రం కూతురు ఇష్టంలేని పెళ్లి చేసుకుందన్న బాధలోనే ఉండిపోయారు. చిన్న కూతురు అమెరికాలో లా చదువుతానని తల్లిదండ్రుల్ని అడిగింది. వారు ఇందుకు ఒప్పుకోలేదు.

దీంతో అక్క సాయంతో ఆమె అమెరికా వెళ్లిపోయింది. రెండో కూతురు కూడా తమకు ఇష్టంలేని పని చేయటంతో వారు మరింత బాధకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే పెద్ద కుమారుడు నాలుగు నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. దీంతో ఆ దంపతులు కృంగిపోయారు. పిల్లలు తమ మాటను లెక్కచేయటం లేదని, ప్రేమగా వ్యవహరించటం లేదని ఇద్దరూ దిగులుపడ్డారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సరస్వతమ్మ విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆ విషయం తెలిసిన కొన్ని నిమిషాల్లోనే రవిశంకర్‌ కూడా విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఇద్దరి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

gamdomCasibomJojobet Girişjojobet güncel girişjojobet giriş