iDreamPost

తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 95 కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 95 కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 95 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వైరస్ నియంత్రణకు ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు చేపడుతున్నా చాపకింద నీరులా వైరస్ విస్తరిస్తోంది. తెలంగాణలో 61, ఏపీలో 34 కొత్త కేసులు ఈరోజు నమోదయ్యాయి. ఫలితంగా తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 592 కు చేరింది. ఏపీలో 473 మూడుకు చేరింది. ఏపీ లో కొత్తగా నమోదైన 34 కేసులో గుంటూరు లోనే అత్యధికంగా 16 కేసులు నమోదయ్యాయి. దీంతో గుంటూరు జిల్లాలో కేసుల సంఖ్య 190కు చేరింది. గుంటూరు తర్వాత కర్నూలు జిల్లాలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ జిల్లాలో ఇప్పటివరకు 91 కేసులు నమోదయ్యాయి.

ఇక తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో కొత్త కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే హైదరాబాద్లోనే కేసుల సంఖ్య ఎక్కువగా నమోదైంది. రాజధాని నగరంలో ఇప్పటివరకు 270 మంది కరోనా బారిన పడ్డారు. హైదరాబాదులో కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం నగరాన్ని126 క్లస్టర్లుగా విభజించింది. పోలీసు, రెవెన్యూ, వైద్య అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. వచ్చేనెల 3 వరకు లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేసేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి