iDreamPost
android-app
ios-app

శ్రియ భర్తకు వైరస్ షాక్

  • Published Apr 14, 2020 | 12:47 PM Updated Updated Apr 14, 2020 | 12:47 PM
శ్రియ భర్తకు వైరస్ షాక్

టాలీవుడ్ లో దశాబ్దంన్నర కాలంగా హీరోయిన్ గా చెలామణి అవుతూ ఇప్పటికీ అవకాశాలు ఒడిసిపడుతున్న శ్రియ శరన్ భర్త ఆండ్రీ కొస్చీవ్ కు కరోనా చిన్న ఝలక్ ఇచ్చింది. స్పెయిన్ లో ఈ వ్యాధి కరాళ నృత్యం చేస్తున్న వేళ తన భర్తలోనూ ఇలాంటి లక్షణాలున్నాయని అందుకే వెంటనే హోమ్ ఐసోలేషన్ లో ప్రత్యేకమైన గదిలో ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పింది శ్రియ. ఓ ప్రముఖ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ మొదట కోవిడ్ 19 సింప్టమ్స్ కనిపించగానే బార్సిలోనా హాస్పిటల్ కు తీసుకెళ్లామని చెప్పింది.

అయితే ప్రాధమికంగా టెస్ట్ చేసిన చేసిన డాక్టర్లు ప్రస్తుతానికి భయపడే స్టేజిలో ఏమి లేదని, వెంటనే ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోమని, ఒకవేళ ఇక్కడే ఉంచితే ఇతర రోగుల ద్వారా త్వరగా సోకే ప్రమాదం ఆండ్రీలో చాలా ఉందని చెప్పడంతో వెంటనే వచ్చేశామని పేర్కొంది. ఏ నిమిషంలో ఎలాంటి అవసరం పడినా ఆసుపత్రికి తరలించేందుకు సిధ్దంగా ఉన్నామని చెప్పిన శ్రియ ప్రస్తుతానికి అంతా కూల్ గా ఉన్నట్టు పేర్కొంది. సోషల్ మీడియాలోనూ తన అభిమానుల కోసం వివరణ ఇచ్చిన శ్రియ మొత్తానికి భర్త విషయంలో టెన్షన్ గానే ఉన్నట్టుంది. ప్రస్తుతం ఈ జంట స్పెయిన్ లోనే ఉంది. ఎక్కడికి వెళ్లే అవకాశం లేకపోవడంతో ప్రస్తుతం ఇంటిపట్టునే ఉండి విశ్రాంతి తీసుకుంటోంది ఈ జంట.

మార్చి 13న శ్రియ కపుల్ పెళ్లి రోజు. ఒక రెస్టారెంట్ కు వెళ్లి జరుపుకుందామని అక్కడికి చేరుకున్నప్పుడు అది మూతబడి కనిపించిందని అప్పుడే పరిస్థితిలోని తీవ్రత అర్థమై తమ సంబరాన్ని రద్దు చేసుకుందామని చెప్పింది. ప్రపంచమంతా తల్లడిల్లుతున్న వేళ కరోనా మహమ్మారి త్వరగా వెళ్లిపోవాలని కోరుకుంటున్నట్టు చెప్పింది. ప్రస్తుతం శ్రియ కోసం ఓ రెండు ప్రాజెక్టులు వెయిట్ చేస్తున్నాయి. అయితే అంతర్జాతీయంగా విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చేందుకు టైం పట్టేలా ఉండటంతో వాటిని వదులుకునే అవకాశం లేకపోలేదని ఇన్ సైడ్ టాక్. ప్రస్తుతానికి ఆండ్రూ అవుట్ అఫ్ డేంజర్ లో ఉన్నాడు.

Jojobet Girişgrandpashabetcasibomjojobetcasibomjojobetpokerklasmadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş