iDreamPost
android-app
ios-app

వినియోగదారులకు షాక్.. పెరిగిన గ్యాస్ ధరలు.. ఎంతంటే?

  • Published Mar 01, 2024 | 11:39 AM Updated Updated Mar 01, 2024 | 11:50 AM

వినియోగదారులకు షాక్. గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. చమురు కంపెనీలు ధరలు పెంచడంతో గ్యాస్ సిలిండర్ ధరల్లో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. గ్యాస్ సిలిండర్ ధర ఎంత పెరిగిందంటే?

వినియోగదారులకు షాక్. గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. చమురు కంపెనీలు ధరలు పెంచడంతో గ్యాస్ సిలిండర్ ధరల్లో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. గ్యాస్ సిలిండర్ ధర ఎంత పెరిగిందంటే?

వినియోగదారులకు షాక్.. పెరిగిన గ్యాస్ ధరలు.. ఎంతంటే?

కొత్త నెల ప్రారంభమవుతుందంటే చాలు సామాన్యుల జేబులకు చిల్లులు పడ్డట్టే. కొన్నింటి ధరలు తగ్గుతుంటే.. మరికొన్నింటి ధరలు పెరుగుతూ షాకిస్తుంటాయి. బ్యాంకింగ్ సెక్టార్, జీఎస్టీ రూల్స్ ఛేంజ్ అవుతూ కస్టమర్లపై ఆర్థిక భారాన్ని మోపుతుంటాయి. వీటికి తోడు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. ధరల పెరుగుదలతో ఏం కొనలేని పరిస్థితి దాపరిస్తోంది. ముఖ్యంగా గ్యాస్ ధరలు అంతకంతకు పెరుగుతూ ప్రజలపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. అంటించకముందే గ్యాస్ ధరలు భగ్గుమంటున్నాయి. తాజాగా గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి పెరిగాయి.

చమురు కంపెనీలు వంట గ్యాస్ ధరల్ని సవరించాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లు మరోసారి పెరిగాయి. ప్రధాన మెట్రో సిటీల్లో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ. 25.50 చొప్పున పెరిగింది. పెగిన ధరలతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,795 కు పెరిగింది. ముంబైలో ఇది రూ. 1749కి చేరగా.. కోల్‌కతా, చెన్నైల్లో వరుసగా రూ. 1911, రూ. 1960.50 గా ఉంది. హైదరాబాద్ లో గరిష్ట స్థాయిలో రూ. 2027 వద్దకి చేరింది. కాగా ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తాయి. పెరిగిన ధరలు మార్చి 1 నుంచే అమల్లోకి రానున్నాయి.

ప్రధాన నగరాల్లో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలు

  • ఢిల్లీ- రూ.1,795
  • ముంబై- రూ.1,749
  • కోల్​కతా- – రూ.1,911
  • చెన్నై- రూ.1,960.50
  • చండీగఢ్- రూ.1,816
  • బెంగళూరు- రూ.1,875
  • ఇండోర్- రూ.1,901
  • అమృత్ సర్- రూ.1,895
  • హైదరాబాద్​- రూ. 2027