iDreamPost

OTT లో కడుపుబ్బా నవ్వించే మరో కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే !

  • Published Jun 17, 2024 | 3:07 PMUpdated Jun 17, 2024 | 3:07 PM

OTT New Release: హర్రర్ , సస్పెన్స్ సినిమాలకు ఓటీటీ లో ఎంత క్రేజ్ ఉంటుందో.. ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూసే కామెడీ చిత్రాలకు కూడా అదే రేంజ్ లో బజ్ నడుస్తుంది. ఈ క్రమంలో డైరెక్ట్ గా ఓటీటీ లోకి మరొక కామెడీ మూవీ రాబోతుంది. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

ఎప్పుడు హర్రర్, సస్పెన్స్ , ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ చూసి బోర్ కొట్టేస్తే.. దాని నుంచి డీవియేషన్ కావాలంటే మాత్రం కామెడీ మూవీస్ చూడాల్సిందే. అందులోను ఇప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూసే సినిమాలు చాలా తగ్గిపోయాయి. కాబట్టి అందరు కలిసి చూసే చిత్రాలు ఏమైనా ఉన్నాయంటే.. కేవలం కామెడీ చిత్రాలు మాత్రమే. మరి ఈ క్రమంలో ఈ వారం డైరెక్ట్ గా ఓటీటీ లోకి ఓ మంచి కామెడీ మూవీ రాబోతుంది. కాబట్టి ఎంచక్కా చూసి ఎంజాయ్ చేసేయండి. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేద్దాం.

ఇప్పుడు సినిమాలు, సిరీస్ లంటే కేవలం వారికి నచ్చిన భాషలో ఉంటె మాత్రమే చూడడం లేదు. ఆ సినిమాలు ఏ లాంగ్వేజ్ లో ఉన్నా సరే.. కథను బట్టి ఆదరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కథ ఇలాంటిదే. అది కూడా డైరెక్ట్ గా ఓటీటీ లోనే స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమా పేరు.. “శర్మాజీ కి బేటీ” . ఈ సినిమాను ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా భార్య తాహిరా కశ్యప్ డైరెక్ట్ చేశారు. మొదటి సారి ఈమె ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. కాగా ఈ సినిమాలో సాక్షి తన్వర్ లీడ్ రోల్ లో నటించారు . ఆమెతో పాటు దివ్యా దత్తా, సయామీ ఖేర్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో జూన్ 28 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.

ఇక శర్మాజీ కి బేటీ సినిమా కథ విషయానికొస్తే.. ఇది ఓ ఫ్యామిలీ చుట్టూ తిరిగే కథ. ప్రస్తుతం సమాజంలో మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలు.. శర్మ అనే ఇంటిపేరు కలిగిన ముగ్గురు మధ్య వయసు మహిళలు, ఇద్దరు టీనేజ్ అమ్మాయిలకు ఎదురైన అనుభవాలను.. కామెడీ యాంగిల్ లో చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్ . ఇలాంటి ప్లాట్స్ తో వచ్చే సినిమాలన్నీ కూడా బాగానే సక్సెస్ అవుతూ ఉంటాయి. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ సంపాదించుకుంటుంది అనేది చూడాల్సి ఉంది. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి