iDreamPost

గురువు ఔదార్యం.. ఉద్యోగాలు సాధించిన శిష్యులకు విలువైన బహుమతులు.. ఏమిచ్చారంటే?

ఓ గురువు తన శిష్యుల పట్ల ఔదార్యం చాటుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన తన శిష్యులకు విలువైన బహుమతులు అందించారు. దీంతో ఆ గురువుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఓ గురువు తన శిష్యుల పట్ల ఔదార్యం చాటుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన తన శిష్యులకు విలువైన బహుమతులు అందించారు. దీంతో ఆ గురువుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

గురువు ఔదార్యం.. ఉద్యోగాలు సాధించిన శిష్యులకు విలువైన బహుమతులు.. ఏమిచ్చారంటే?

ఓ వ్యక్తి ఎదుగుదలలో గురువు పాత్ర ఎంతో కీలకం. తమ శిష్యులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించేవారు గురువులు. శిష్యులు గురువుకు ఏదో ఇవ్వాల్సిన పనిలేదు గురువు మెచ్చే పని చేస్తే చాలు. గురుదక్షిణ కంటే శిష్యులు సాధించిన విజయాలే గురువులకు ఎక్కువ సంతృప్తినిస్తుంటాయి. ఇదే అంశానికి చెందిన విషయంలో.. ఓ గురువు తన వద్ద కోచింగ్ తీసుకున్న శిష్యులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో ఆనందంలో మునిగిపోయారు. ఉద్యోగాలు సాధించిన శిష్యుల పట్ల ఔదార్యాన్ని చాటుకున్నారు. ఏకంగా వారికి విలువైన బహుమతులను అందించారు. ఆ విధంగా ఔదార్యం చాటుకున్న గురువు మరెవరో కాదు రిటైర్డ్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌, జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన గంగాధర్‌.

గతేడాది విడుదలైన పోలీస్ కొలువులకు పోటీపడే అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందించారు గంగాధర్. ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌ మండలాలకు చెందిన పలువురు ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు మెట్ పల్లిలో ఉన్న అంబేద్కర్‌ స్టేడియంలో ఫ్రీగా శిక్షణ ఇచ్చారు. ఆ సమయంలో గురువు గంగాధర్ తన శిష్యులను ఎంకరేజ్ చేసేవిధంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ కొలువులకు ఎంపికైతే గోల్డ్, సిల్వర్ బ్రాస్ లెట్లను అందిస్తానని మాటిచ్చారు. ఎస్సై ఉద్యోగానికి ఎంపికైతే బంగారు, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైతే వెండి బ్రాస్‌లెట్లు అందజేస్తానని గంగాధర్‌ ప్రకటించారు.

ఈ క్రమంలోనే ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికైన ఎనిమిది మందికి శనివారం మెట్‌పల్లిలో వెండి బ్రాస్‌లెట్లను బహూకరించారు. శిష్యులపట్ల ఔదార్యం చూపి వెండి బ్రాస్‌లెట్లను అందించిన గంగాధర్ పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సమాజానికి ఇలాంటి గురువులు అవసరం అని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి గంగాధర్ తన శిష్యులకు బహుమతులు అందించిన తీరుపట్ల మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి