iDreamPost

విశాఖ అగ్నిప్రమాదంపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి.. యూట్యూబర్‌ కోసం గాలింపు

  • Published Nov 20, 2023 | 11:20 AMUpdated Nov 20, 2023 | 11:20 AM

ఆదివారం అర్థరాత్రి విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ ప్రమాదంపై స్పందించారు. ఆ వివరాలు..

ఆదివారం అర్థరాత్రి విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ ప్రమాదంపై స్పందించారు. ఆ వివరాలు..

  • Published Nov 20, 2023 | 11:20 AMUpdated Nov 20, 2023 | 11:20 AM
విశాఖ అగ్నిప్రమాదంపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి.. యూట్యూబర్‌ కోసం గాలింపు

విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌లో ఆదివారం అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 60కి పైగా కార్లు దగ్ధమయినట్లు తెలుస్తోంది. మొదట వాటి సంఖ్య 40 ఉండగా.. ఆ తర్వాత 60కి పెరిగిందంటున్నారు అధికారులు. ఇక అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధితులను వెంటనే ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి.. కారణాలు తెలుసుకోవాలని.. బాధ్యులను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాక మంత్రి సీదిరి అప్పలరాజును ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి.. బాధితులకు అండగా నిలవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. అంతేకాక బోట్లు కోల్పోయిన మత్స్యకారులను ఆదుకోవాలని.. వారికి తగినసాయం చేయాలని వైఎస్‌ జగన్‌ అధికారులకు సూచించారు.

ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకున్న ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 60కిపైగా బోట్లు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. ప్రమాదంలో కాలిపోయిన పడవల్లో.. ఒక్కో దాంట్లో రూ.5-6 లక్షల విలువైన చేపలున్నాయని మత్స్యకారులు తెలిపారు. ఎవరో ఆకతాయి చేసిన పని వల్ల ఈ ప్రమాదం సంభవించిందని బాధిత కుటుంబాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిమరో కొత్త కోణం వెలుగు చూసింది. ఫైర్‌ యాక్సిడెంట్‌ చోటుచేసుకున్న సమయంలో ఘటనా స్థలంలో ఓ యూట్యూబర్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ క్రమంలో సదరు యూట్యూబర్‌ మీద కేసు నమోదు చేశారు. నిందితులు ఆదివారం రాత్రి ఫిషింగ్‌ హార్బర్‌లో పార్టీ ఏర్పాటు చేశాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మద్యం మత్తులో గొడవ జరిగినట్లు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న యూట్యూబర్‌ కోసం గాలిస్తున్నారు. అంతేకాక సంఘటనా స్థలం వద్ద ఉన్న సీసీ కెమరాలను కూడా పరిశీలిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సుమారు 5 గంటల పాటు శ్రమించి.. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ప్రమాదం కారణంగా సుమారు 40 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బోట్లలో మత్స్యకారులు ఎవరూ లేరని.. అందువల్లే ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అంటున్నారు. తమకు జీవనాధారమైన బోట్లు కాలిపోయాయని.. తమను ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి