iDreamPost

YS జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. పశ్చిమ గోదావరి జిల్లాలో 16వ రోజు హైలెట్స్!

Memantha Siddham Day-16: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా 'మేమంతా సిద్ధం' పేరుతో చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ బస్సు యాత్ర మంగళవారం 16వ రోజు పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగింది.

Memantha Siddham Day-16: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా 'మేమంతా సిద్ధం' పేరుతో చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ బస్సు యాత్ర మంగళవారం 16వ రోజు పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగింది.

YS జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. పశ్చిమ గోదావరి జిల్లాలో 16వ రోజు హైలెట్స్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ‘మేమంతా సిద్ధం’ పేరుతో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్రకు అపూర్వ స్పందన లభిస్తుంది. ఈయాత్ర ద్వారా తాను అందించిన సంక్షేమ పథకాలను, పాలన గురించి ప్రజలకు వివరించి.. అలానే వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపిస్తున్నారు. ‘మేమంతా సిద్ధం’యాత్రకు అన్ని జిల్లాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మంగళవారం 16 రోజు  జిల్లాలో సీఎం జగన్ చేపట్టిన ‘మేమంత సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగింది. మరి.. 16వ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన మేమంత సిద్ధం యాత్ర వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర మంగళవార 16వ రోజూ పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగింది. మంగళవారం ఉదయం నారాయణపురం నుంచి 16వ రోజు బస్సు యాత్ర ప్రారంభమైంది. అక్కడ నుంచి ఉదయం 9 గంటలకు తొమ్మిది గంటలకు బయలుదేరి నిడమర్రు, గణపవరం మీదుగా ఉండి చేరుకున్నారు. అక్కడ శివారులో సీఎం జగన్ భోజన విరామం తీసుకున్నారు. అనంతరం భీమరవం బైపాస్ రోడ్డు గ్రంథి వెంకటేశ్వరావు జూనియర్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు.  సభ అనంతరం పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకుంటారు.

ఇక యాత్రలో 16వ రోజు సీఎం జగన్ కి గోదావరి జిల్లా వాసులు బ్రహ్మరథం పట్టారు. గ్రామ గ్రామాన, అడుగడుగున సీఎం జగన్ కి అక్కచెల్లెమ్మలు హారతులు పడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. మళ్లీ సీఎం కావాలంటూ యాత్రలో పాల్గొన్న మహిళలు నినాదాలుచేశారు. దెందులూరు, గురజాల నియోజకవర్గాలకు చెందిన పలువురు టీడీపీ నేతలు సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఇక సీఎం జగన్ కు దారిపొడవును పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర సాగిన మార్గాంలో జనం పోటెత్తారు.  ఇక భీమవరంలో ఏర్పాటు చేసి సభలో సీఎం జగన్ ప్రసంగించారు.

ఇక సీఎం జగన్ మాట్లాడుతూ..” భీమవరంలో జనసముద్రం కనిపిస్తోంది. అలానే  ఉప్పొంగిన ప్రజాభిమానం ఇక్కడ నాకు కనిపిస్తోంది. మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ఓటు  ఐదేళ్ల రాష్ట్ర భవిష్యత్ ను నిర్ణయిస్తుంది.  ఈ ఎన్నికలు మన తలరాతను మార్చేవి. పేదలకు, చంద్రబాబు మోసాలకు జరగుతున్న ఎన్నికలు ఇవి. మీ బిడ్డది పేదల పక్షం. చంద్రబాబుకు నాపై కోపం ఎక్కువ వస్తుంది. అందుకే శాపనార్థాలు పెడుతూ ఉంటాడు. నాకు ఏదో అయిపోవాలని కోరుకుంటాడు. బాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే స్కీమ్ ఒక్కటైనా ఉందా అని అడిగాను. ఆయన పేరు చెబితే మోసాలు, వెన్నుపోటులు, మోసం, దగా, అబద్దాలు, కుట్రలు గుర్తుకు వస్తాయి. ఇక ఆయన దత్తపుత్రుడి వచ్చే బీపీని అసలు తట్టుకోలేము. చేతులూపేస్తాడు, కాళ్లు ఊపేస్తాడు. అలానే తల ఊపేస్తాడు” అంటూ చంద్రబాబు, పవన్ లపై సీఎం జగన్ ఫైర్ అయ్యారు.  మొత్తంగా పశ్చిమ గోదావరి జిల్లాలలో పూల వాన కురిపిస్తూ సీఎం జగన్ కి స్థానిక ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. గుమ్మడి కాయలు, హారతితో దిష్టి తీసి సీఎం జగన్ కు మహిళలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఇలా 16వ రోజు సీఎం జగన్ బస్సుయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా సాగింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి