iDreamPost

గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ.. మంత్రివర్గవిస్తరణకు ముహూర్తం ఖరారు

గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ.. మంత్రివర్గవిస్తరణకు ముహూర్తం ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 11వ తేదీన మంత్రివర్గం పునర్‌ వ్యవస్థీకరణ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు కొత్త మంత్రులతో ప్రమాణం చేయించాలని గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు. కొద్దిసేటి క్రితం సీఎం జగన్‌ గవర్నర్‌తో భేటీ అయ్యారు.

గవర్నర్‌తో దాదాపు 45 నిమిషాలపాటు సమావేశమైన సీఎం జగన్‌ మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటు గురించి వివరించారు. పరిపాలనా సంస్కరణలో భాగంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్లు గవర్నర్‌కు వివరించారు. మంత్రివర్గం పునర్‌ వ్యవస్థీకరణ చేయనున్న విషయాన్ని గవర్నర్‌కు తెలిపారు. ఈ నెల 11వ తేదీన సచివాలయం వద్ద కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసి, కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని సీఎం జగన్‌ గవర్నర్‌ విశ్వభూషన్‌ హరిచందన్‌ను కోరారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి