iDreamPost

YS Jagan, Pawan: ఓటమిని కొని తెచ్చుకున్న పవన్.. ఈ సారి కూడా..!

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసే ప్రసంగాలు, వ్యాఖ్యలు ఆయనకే చేటు తెస్తున్నాయి. ఆయనకు ఎదురుగా జ‌నం, కెమెరాలు, చేతిలో మైకు వుంటే, మాట్లాడతారో కూడా తెలియ‌దు. అలా ఇటీవల ఓ సభలో చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఆయన ఓటమికి కారణం కాబోతున్నాయనే టాక్ వినిపిస్తోంది.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసే ప్రసంగాలు, వ్యాఖ్యలు ఆయనకే చేటు తెస్తున్నాయి. ఆయనకు ఎదురుగా జ‌నం, కెమెరాలు, చేతిలో మైకు వుంటే, మాట్లాడతారో కూడా తెలియ‌దు. అలా ఇటీవల ఓ సభలో చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఆయన ఓటమికి కారణం కాబోతున్నాయనే టాక్ వినిపిస్తోంది.

YS Jagan, Pawan: ఓటమిని కొని తెచ్చుకున్న పవన్.. ఈ సారి కూడా..!

జ‌న‌సేన అధ్యక్షుడు ప‌వ‌న్‌ క‌ల్యాణ్  గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా రాజకీయాల్లో ఆయన తీరు సామాన్య జనంతో పాటు ఆయన అభిమానులను సైతం అయోమయానికి గురి చేస్తుంది. ఇక పవన్ కల్యాణ్ లో ఉన్న ప్రత్యేకమైన గుణం.. ఎదురుగా జ‌నం, కెమెరాలు, చేతిలో మైకు వుంటే, మాట్లాడతారో కూడా తెలియ‌దు. బ‌హిరంగ స‌భ‌ల్లో ఏదో మైకం క‌మ్మిన వ్య‌క్తిలా పవన్ ప్ర‌వ‌ర్తిస్తుంటారనేది టాక్. అంతేకాక తీరా స్టేజీ దిగిన త‌ర్వాత‌.. అరె ఇట్లా మాట్లాడానా? అని త‌న‌ను తాను ప్రశ్నించుకుంటారు. ఇలా జరిగిన సందర్భాలు అనేకం. అయితే తాజాగా పవన్ కల్యాణ్ చేసిన పనికి సీఎం జగన్ కి టార్గెట్ గా మారారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఇటీవలే పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన కూటమి ‘జెండా’ పేరుతో తొలి ఎన్నికల సభను నిర్వహించారు.  ఈ సభలో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో అనేది చెప్పడం మానేసి.. సీఎం జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఇద్దరూ అదే ధోరణిలో తమ ప్రసంగాన్ని కొనసాగించారు. ముఖ్యంగా పవన్ ఒకడుగు ముందుకేసి..శృతిమించి.. సీఎం జగన్ పై మాట్లాడారు. ఇక ఈ స‌భ‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌సంగం అదుపు త‌ప్పింద‌ని మేధావులు అభిప్రాయ పడ్డారు. స‌భా వేదిక‌పై నుంచి పవన్.. జగన్ ను అథఃపాతాళానికి తొక్కుతాన‌ని గ‌ట్టి హెచ్చ‌రిక చేశారు. అయితే రాజ‌కీయం అంటే అరుపులు కాద‌ని ప‌వ‌న్ తెలుసుకుంటే మంచిది.

సీఎం జగన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలే ఆయన పట్టుదల మనిషి. ఏదైనా ఓ విషయాన్ని పట్టుకుంటే.. అది పూర్తయ్యే వరకు వదలరు. అందుకు ఉదాహరణే సోనియాతో ఢీ కొట్టిన విధానం. ఇక ఎవరినైనా ఓడించాలని ఒక్కసారి అనుకుంటే.. అనుకున్న పని చేసేంత వరకూ నిద్రపోరు. జగన్ పొలిటికల్ దెబ్బకు బాధితులు పవన్ కల్యాణ్, నారా లోకేష్. గత ఎన్నికల్లో వీరిద్దరినీ సీఎం జగన్ మట్టి కరిపించిన సంగతి తెలిసిందే. అలా సీఎం జగన్ నిలబెట్టిన అభ్యర్థుల చేతుల్లో రెండు చోట్ల ఓడిపోయిన విషయాన్ని కూడా మర్చిపోయినా పవన్ మళ్లీ  చెలరేగిపోయాడు. స‌భ‌ల్లో రాజ‌కీయ విమ‌ర్శ‌ల వ‌ర‌కే ప‌రిమితం అయితే ఇరుప‌క్షాల‌కు బాగుంటుంది.

తాడేప‌ల్లి గూడెం స‌భ‌లో ప‌వ‌న్ చేసిన ఘాటు వ్యాఖ్యలు ఆయ‌న‌కు చిక్కులు తెచ్చేలా వున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటిక వరకు పవన్ విషయంలో కాస్తా లైట్ గా ఉన్న సీఎం జ‌గ‌న్‌లో మ‌రింత ప‌ట్టుద‌ల పెంచేలా చేశాయి ఈ వ్యాఖ్యలు. ప‌వ‌న్‌ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అసెంబ్లీలో అడుగు పెట్ట‌నివ్వ‌కూడ‌ద‌నే ప‌ట్టుద‌ల సీఎం జ‌గ‌న్‌ లో పెంచారు. ప‌వ‌న్ పోటీ చేస్తార‌ని ప్ర‌చారంలో ఉన్న పిఠాపురంపై జ‌గ‌న్ ప్ర‌త్యేక దృష్టి సారించారు.

ముల్లును ముల్లుతోనే తీయాల‌ని విధానంలో సీఎం జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ముద్ర‌గ‌డ పద్మనాభం కుటుంబ స‌భ్యుల్లో ఎవ‌రో ఒక‌రిని ప‌వ‌న్‌ పై పోటీకి దించాలనే ఆలోచ‌న‌లో సీఎం జ‌గ‌న్ మోహన్ రెడ్డి ఉన్న‌ట్టు తెలుస్తోంది. తాడేపల్లి గూడెం స‌భ‌లో త‌న వాళ్ల‌పై ప‌వ‌న్ అవాకులు చెవాకులు పేల‌డాన్ని గుర్తు చేస్తూ, కాపుల్లోనే ఆయ‌న‌పై తిరుగుబాటు వ‌చ్చేలా వైఎస్సార్ వ్యూహాలు రచిస్తోంది.

మొత్తంగా సీఎం జ‌గ‌న్‌ పై తాను చేసిన వ్యాఖ్యలు  ఏ ర‌కంగా చేటు తెస్తాయో ప‌వ‌న్‌ కు రానున్న రోజుల్లో తెలుసొస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప‌వ‌న్‌ ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ జ‌గ‌న్ విడిచి పెట్ట‌రని, 2019 నాటి చేదు ఫ‌లితాన్ని మరోసారి ప‌వ‌న్‌ కు మిగిల్చేందుకు జ‌గ‌న్ అన్ని అస్త్రాల‌ను ప్ర‌యోగించ‌డానికి సిద్ధంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.  ఇంకా ప‌వ‌న్ అధికారికంగా తాను పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గాన్ని ప్రకటించలేదు. అది ప్ర‌క‌టిస్తే, అప్పుడు అస‌లు సినిమా మొద‌ల‌వుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  ప‌వ‌న్ మాట‌ల నాయ‌కుడైతే, జ‌గ‌న్ చేత‌ల లీడ‌ర్‌ అన్న విషయం అందరికేర్ తెలిసిందే. మొత్తంగా ప‌వ‌న్ గుండెల్లో జ‌గ‌న్ నిద్ర‌పోవ‌డం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి