iDreamPost

ఆ ఉద్యోగాల విషయంలో CM జగన్ దారిలో రేవంత్!

YS Jagan, Revanth Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో సీఎం జగన్ బాటలో ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు నడుస్తున్నాయి.

YS Jagan, Revanth Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో సీఎం జగన్ బాటలో ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు నడుస్తున్నాయి.

ఆ ఉద్యోగాల విషయంలో CM జగన్ దారిలో రేవంత్!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే తీసుకున్న ప్రతి నిర్ణయం సంచలనమే. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసిన..ఎక్కడా ఆయన తగ్గలేదు. పేద ప్రజల సంక్షేమమే తన ధ్యేయం అన్నట్లు సీఎం జగన్ పాలన సాగించారు. అందుకే ఈ 56 నెలల పాలనలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకా చెప్పాలంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి దారిలో ఇతర రాష్ట్రాల సీఎంలు, ఇతర నాయకులు నడుస్తున్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలపై ప్రశంసల వర్షం కురిపించారు. అలానే తాజాగా ఓ విషయంలో సీఎం జగన్ బాటలో తెలంగాణ సీఎం రేవంత్ వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేశారు. అంతేకాక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలను చేరవేస్తున్నారు. అలానే ఇంటి వద్దకే రేషన్ సప్లయ్, జగనన్న ఆరోగ్య సురక్ష, అమ్మ ఒడి వంటి ఎన్నో అద్భుత పథకాలను ప్రవేశపెట్టారు. ఇంకా చెప్పాలంటే సీఎం జగన్ ప్రవేశ పెట్టిన పథకాలను తొలిగించే ధైర్యం ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఉన్నాయి.

ఇలానే ప్రభుత్వ ఉద్యోగుల విషయంలోనూ, పెడింగ్ లో ఉన్న ఉద్యోగాల విషయంలోనూ ప్రభుత్వం సత్వర పరిష్కారం చూపింది. ముఖ్యంగా 1998 డీఎస్సీ, 2018 డీఎస్సీ విషయంలోనూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. డీఎస్సీ-1998 వాళ్లు నియమాక పత్రాలను అందించిన సంగతి తెలిసిందే. అలానే డీఎస్సీ-2008 అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు ఇచ్చింది. ఇలా దాదాపు చాలా పెండింగ్ విషయంల్లోనూ సీఎం జగన్ పరిష్కారం చూపించారు.

ఇక సీఎం జగన్ మోహన్ దారిలోనే పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా వెళ్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణలో వాలంటీర వ్యవస్థ తీసుకొస్తామని ఓ సందర్భంలో తెలిపారు. అలానే విద్యావ్యవస్థ, ఆరోగ్య శ్రీ విషయంలోనూ రేవంత్ రెడ్డి సర్కార్ పలు సంచలన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది. తాజాగా డీఎస్సీ -2008 అభ్యర్థుల విషయంలో రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వారికి ఉద్యోగాలు ఇచ్చే దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. డీఎస్సీ-2008 అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది.

దీంతో ఒక రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చి, మరో రాష్ట్రంలో ఇవ్వకపోవడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఖాళీల్లో భర్తీ చేయాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. కోర్టు చేసిన వ్యాఖ్యలతో ఆ ఉద్యోగాలను భర్తీ చేసే దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. రేషన్ ఇంటి వద్దకు సప్లయ్ విషయంలో అయితే ఏకంగా మోదీ సర్కార్ .. సీఎం జగన్ దారిలో నడుస్తోంది. దేశ వ్యాప్తంగా రేషన్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇలా మొత్తంగా దేశంలోనూ వివిధ రాష్ట్రాలకు ఏపీ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి