iDreamPost

రెండు స్థానాల నుంచి సీఎం కేసీఆర్ పోటీ.. కారణం

రెండు స్థానాల నుంచి సీఎం కేసీఆర్ పోటీ.. కారణం

వచ్చే శాసన సభ ఎన్నికలకు భారాస అభ్యర్థుల తొలి జాబితాను గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలు డిసెంబరులో జరిగే అవకాశాలుండటంతో .. గతంలో మాదిరిగానే కనీసం మూడు నెలల  ముందుగానే అభ్యుర్ధుల జాబితాను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడించారు. 2018 ఎన్నికల సమయంలో ఒకేసారి  105 మందితో తొలి జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించారు.  ఈ దఫా 115 మందితో  తొలి జాబితాను ప్రకటించారు. కేవలం నాలుగే స్థానాలను పెండింగ్ లో పెట్టారు. అయితే ఈ సారి వెల్లడించిన జాబితాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.  ముఖ్యమంత్రి కేసీఆర్  ఈ సారి రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయనున్నారు.

సీఎం కేసీఆర్ ప్రస్తుతం మెదక్ జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో తన సిట్టింగ్ స్థానం గజ్వేల్ తో పాటు  కామారెడ్డి నుంచి  పోటీ చేయనున్నారు. కేసీఆర్ కు రెండు చోట్ల ఒకేసారి పోటీ చేయడం, కొత్త స్థానాల్లోకి వెళ్లి పోటీ చేయడం కొత్తమే కాదు. 2014లో మెదక్ ఎంపీ స్థానంలో పాటు, గజ్వేల్ ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. మెదక్ ఎంపీ స్థానానికి రాజీమానా చేసి.. గజ్వేల్ ఎమ్మెల్యేగా కొనసాగారు.

మహబాబు నగర్ ఎంపీగా కూడా పోటీ చేసి గెలిచారు. సిద్ధిపేట, కరీంనగర్ అసెంబ్లీ స్థానాల్లో కూడా సీఎం కేసీఆర్ పోటీ చేసి గెలుపొందారు. ఇలా స్థానాలు మారి పోటీ చేయడం, రెండు స్థానాలో పోటీ చేయడం కేసీఆర్ కి కొత్తేమి కాదు. అయితే ఈ సారి కామారెడ్డి శాసన సభ స్థానం నుంచి పోటీ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఉమ్మడి నిజమాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ..మిగిలిన జిల్లాలతో పోలీస్తే.. కాస్త బలహీనంగా ఉన్నట్లు టాక్. అంతేకాక జిల్లా నేతలు కూడా కేసీఆర్ ను  తమ జిల్లా నుంచి పోటీ చేయమని కోరారు.

నిజమాబాద్, కరీంనగర్ జిల్లాలోని ఏదో ఒక్క స్థానం నుంచి పోటీ చేస్తే.. పార్టీకి బలం చేకూరుతుందని నేతలు భావించారు. అదే విషయాన్ని అధినేతకు వివరించి.. పోటీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా కామారెడ్డి పోటీపై  సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. తాను  ఈ సారి కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. స్థానిక నేతల విజ్ఞప్తితోనే గజ్వేల్ తో పాటు కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. మరి.. మరోసారి కేసీఆర్  రెండు స్థానాల్లో పోటీ చేయనుండపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి