iDreamPost

KCR బతికుండగా రైతుబంధును ఆపగలరా? కాంగ్రెస్ కు CM సవాలు!

తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీల నేతలు ప్రచారాల వేగాన్ని పెంచేశారు. ఇక గులాబీ అధినేత కారు గేర్ మార్చి.. స్పీడ్ పెంచేశారు. కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీల నేతలు ప్రచారాల వేగాన్ని పెంచేశారు. ఇక గులాబీ అధినేత కారు గేర్ మార్చి.. స్పీడ్ పెంచేశారు. కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

KCR బతికుండగా రైతుబంధును ఆపగలరా? కాంగ్రెస్ కు CM సవాలు!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పర్వం చివరి దశకు చేరుకుంది. గెలుపే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక ప్రచారాలకు నేడే చివరి రోజు.. సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోనున్నాయి. ఇదే సమయంలో నేతలు పరస్పరం సవాలు విసుకుంటున్నారు. ఇక గులాబీ అధినేత  కేసీఆర్.. ప్రతిపక్ష పార్టీలపై దూకుడు పెంచారు. సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. కేసీఆర్ బతికుండగా రైతుబంధువును ఆపగలరా అంటూ కాంగ్రెస్ నేతలకు సీఎం కేసీఆర్ సవాలు చేశారు.

సోమవారం షాద్ నగర్ చేవెళ్ల, అందోల్, సంగారెడ్డిలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభకు సీఎం కేసీఆర్ విచ్చేసి.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అంతేకాక కాంగ్రెస్ పార్టీపై, ఆ నేతలపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఓట్లకోసం కాంగ్రెస్‌ నేతలు రైతుల నోట్లో మట్టికొట్టారని కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లకు పిచ్చి పట్టుకుందని, రైతు బంధును ఆపితే గెలుస్తమేమేనని కుట్ర చేస్తున్నారని తెలిపారు. ఢిల్లీకి షికాయత్‌ల మీద షికాయత్‌లు జేసి రైతుబంధును రైతులకు అందకుండా చేశారు.

ఎన్ని రోజులు ఆపుతారు మీరు? మూడో తారీకు ఓట్లు లెక్కపెడితే మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే వస్తుంది. ఆరో తేదీ నుంచి ఎవరి మోతాదు లేకుండా సంతోషంగా రైతుబంధు ఇస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.  అదే విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్లు ధరణి  రద్దు చేస్తాం, కరెంటు 3 గంటలే ఇస్తామని అంటుంటే ఆ పార్టీలో ఎలా ఉన్నారంటు కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి చెప్పారు. కాంగ్రెస్‌ అని తిరిగితే రేపు మీ కొంపలు కూడా ఆరుతాయి కదా?, నువ్వు రైతువేనా? కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా గుండెమీద చేయ్యి వేసుకుని ఆలోచన చేసుకోవాలని సూచించారు.

ఇంకా కేసీఆర్ మాట్లాడుతూ.. అభ్యర్థుల గుణగణాలతో పాటు వారి వెనుక ఉన్న పార్టీల విధానాలను చూడాలని ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. ఓటును చెడ్డవారికి వేస్తే వచ్చి ఫలితం చెడుగా ఉంటుందని, అదే మంచివారికి వేస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి, ప్రలోభాలకు లొంగకుండా ఓటేయాలని ఆయన సూచించారు. కాంగ్రెస్‌ చరిత్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు.

కాంగ్రెస్ నేతలు మళ్లీ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారని. మరి ఇందిరమ్మ రాజ్యంలో ఏం చక్కదనం ఉన్నదని, ఎవరు బాగుపడ్డారని, అత్యవసర స్థితి పెట్టి లక్షలాది మందిని జైళ్లలో పెట్టారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ నేతలు ఇంకా 1940 మోడల్ లోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇదే సందర్బంగా కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. కేసీఆర్ బతికుండగా రైతుబంధువును ఆపగలరా? అంటూ కాంగ్రెస్ నేతలకు సీఎం సవాలు విసిరారు. మరి.. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి