iDreamPost
android-app
ios-app

ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్నదే మా తాపత్రయం: సీఎం జగన్

ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్నదే మా తాపత్రయం: సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం వరద ప్రభావానికి గురైన జిల్లాలో  పర్యటించారు. అల్లూరి  సీతారామరాజు, ఏలూరు జిల్లాలో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాలైన కూనవరం, వీఆర్ పురం మండలాల్లోని వరద బాధిత కుటుంబాలతో సీఎం మాట్లాడారు.  అనంతరం కుక్కునూరు  మండలం గొమ్ముగూడెం సందర్శించారు. కూనవరంలో వరద బాధిత ప్రజలతో సీఎం మాట్లాడారు. వరద సహాయ, పునరావాస చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.  అధికారులు ఏ మేరకు బాధితులకు సాయం అందించారనే విషయాన్ని బాధితులనే స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఇక కూనవరంలో సీఎం జగన్ మాట్లాడుతూ… “ఈ ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుంది. డబ్బులు మిగలుచ్చుకోవాలనే ఆరాటం మా ప్రభుత్వానికి లేదు. అలానే ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్నదే మా ప్రభుత్వ తాపత్రయం. ఎవరికైన వరద సాయం అందకుంటే నాకు తెలియజేయండి.  ఇళ్లలోకి నీరు వచ్చిన వారికి రూ.2వేలు ఆర్థిక సాయం చేశాము.  అలానే వరద బాధితులకు నిత్యవసర సరకులు అందించాం. వరదల  ధాటికి ఇళ్లు దెబ్బతిని ఉంటే.. అలాంటి కుటుంబానికి రూ.10వేలు ఇచ్చాము. వరద ప్రభావిత ప్రాంతంలో అధికారులు వారం పాటు ఉన్నారు.

ఇక బాధితులకు నష్ట పరిహారం పక్కాగా అందేలా  చర్యలు తీసుకున్నాం. వరద సాయం అందలేదని ఒక్క ఫిర్యాదు రాలేదు. అలానే ప్రజలకు అందించే సాయం విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు. ఇక ఈ పోలవరం నిర్మాణంలో మా  ప్రభుత్వం క్రెడిట్ కోసం ఆలోచించదు. ప్రజలకు న్యాయం చేయడమే మా సంకల్పం” అని సీఎం తెలిపారు. ఇంకా పోలవరం గురించి  సీఎం జగన్ పలు విషయాలు వెల్లడించారు. ” ఆర్ అండ్ ఆర్ విషయంలో కేంద్రం నిధులకు తోడు రాష్ట్ర నిధులు కేటాయిస్తుంది. పోలవరం ముంపు బాధితుల పునరావాస ప్యాకేజీ పారదర్శకంగా అమలు చేస్తున్నాము. పునరావాస ప్యాకేజీకి త్వరలోనే కేంద్రం ఆమోదం తెలుపుతుంది.

పోలవరం నిర్మాణంలో  చంద్రబాబు బుద్ధి లేకుండా వ్యవహరించారు. బాధితులకు రావాల్సిన ప్యాకేజ్ పై మంచి జరుగుతుంది. ప్రతి నిర్వాసిత కుటుంబానికి న్యాయపరమైన ప్యాకేజీ అందుతుంది. ముంపు ప్రాంతాల్లో లీడరార్ సర్వే ద్వారా అందరికీ న్యాయం జరుగుతోంది. ఇక మూడు దశల్లో పోలవరం డ్యాంలో నీళ్లు నింపుతాం. ఒక్కేసారి నింపితే డ్యామ్ కూలిపోయే ప్రమాదం ఉంది. సీడబ్ల్యూసీ నింబధనల ప్రకారం పోలవరం డ్యామ్ లో నీళ్లు నింపుతాము” అని సీఎం తెలిపారు. మరి..  కూనవరంలో వరద బాధిత కుటుంబాలతో సీఎం  జగన్ మాట్లాడిన వ్యాఖ్యల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదీ చదవండి: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ సీఎం జగన్ ప్రస్తావన!