iDreamPost

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ సీఎం జగన్ ప్రస్తావన!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ సీఎం జగన్  ప్రస్తావన!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తీరు అద్భుతం. చరిత్రలో కనివిని ఎరుగుని రీతిలో సీఎం జగన్ ఘన విజయం సాధించారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 175 గాను 151 స్థానలో విజయం సాధించి.. ప్రతిపక్షాలను అడ్రెస్ లేకుండా చేశాడు. అయితే ఆయన అంతటి ఘన విజయం అందుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది గత ప్రభుత్వాలు వేధింపులకు గురి చేయడం. దీంతో ప్రజల్లో  జగన్ పై  అభిమానం పెరిగింది. ఈ చరిత్ర జరిగి..నాలుగేళ్లు కావొస్తున్న.. ఎంతో మంది రాజకీయ నాయకులు గుర్తు చేసుకుంటునే ఉన్నారు. తాజాగా ఏపీ సీఎం జగన్ ప్రస్తావన అసెంబ్లీ సమావేశాల్లో వచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

గత మూడు రోజుల నుంచి  జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆదివారం ముగిశాయి. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవే చివరి సమావేశాలు కావటంతో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి నిరవధిక వాయిదా వేశారు. ‘తెలంగాణ ఆవిర్భావం- స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతి’ అంశంపై అంతకు ముందు సభలో సీఎం కేసీఆర్ సుధీర్ఘంగా ప్రసంగించారు. అలానే ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై తనదైన శైలిలో కేసీఆర్  విరుచుకుపడ్డారు.

ఇలా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్.. ఏపీ సీఎం జగన్ పేరును అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి, దివంగత నేత రాజశేఖర్ రెడ్డిని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. వైఎస్సాఆర్ మరణం తరువాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాలుగా వేధింపులకు గురి చేసిందని అన్నారు. జగన్ మోహన్ రెడ్డిని రాంగ్ గా హ్యాండిల్ చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. “జగన్ మోహన్ రెడ్డిని రకరకాలుగా వేధింపులకు గురి చేశారు. దాంతోనే ఆయన సొంత పార్టీని స్థాపించారు.

సొంత పార్టీ పెట్టిన అనంతరం కడప ఎంపీ, పులివెందుల అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ఐదు లక్షల మోజార్టీతో గెలిచిండు. ఆ తరువాత వచ్చిన ఒకట్రెండు ఎన్నికలను కూడా స్వీప్ చేశారు. ఆ తర్వాత ఇక ఆంధ్రాలోమన పని అయిపోయందని కాంగ్రెస్ బోధపడింది” అంటూ సీఎం కేసీఆర్ కామెంట్లు చేశారు. కేసీఆర్ చేసిన ఈ కామెంట్లు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇదే సమావేశాల్లో రెండు రోజుల క్రితం మంత్రి కేటీఆర్ కూడా ఏపీ సీఎం జగన్ ప్రస్తావన్ తీసుకొచ్చారు. ఇలా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రస్తావన రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదీ చదవండి:  ఇంగ్లిష్ లేక చాలా నష్టపోయాం.. సీఎం జగన్ నిర్ణయం గొప్పది: నారాయణమూర్తి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి