iDreamPost

YS Jagan: ప్రధాని మోదీతో ముగిసిన CM జగన్ సమావేశం!

శుక్రవారం ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. దాాదాపు గంటన్నర పాటు పలు అంశాలపై మోదీతో సీఎం జగన్ చర్చించారు. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం జగన్ భేటీ అయ్యారు.

శుక్రవారం ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. దాాదాపు గంటన్నర పాటు పలు అంశాలపై మోదీతో సీఎం జగన్ చర్చించారు. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం జగన్ భేటీ అయ్యారు.

YS Jagan: ప్రధాని మోదీతో  ముగిసిన CM జగన్ సమావేశం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం రాత్రి ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి మోదీతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు  అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం ఉదయం ప్రధానమంత్రితో సీఎం జగన్ భేటీ అయ్యారు. ప్రధానితో సుమారు గంటన్నర పాటు సీఎం జగన్ సమావేశం కొనసాగింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. సీఎం జగన్ గురువారం సాయంత్రం 5.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి.. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఆయన వెంటనే కేఎస్ జవహర్ రెడ్డి,  ఎంపీ మిథున్ రెడ్డి పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.

శుక్రవారం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర సమయం పాటు వీరిద్దరి మధ్య సమావేశం కొనసాగింది. ఇక ప్రధాని మోదీతో జరిగిన భేటీలో పలు అంశాలపై సీఎం జగన్ చర్చించినట్లు తెలుస్తోంది. అందులో ఏపీ ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, పోలవరం నిధులు త్వరితగతిన విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. అలానే పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణ వ్యయంకు సంబంధించిన ఆమోదం, కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనలో ఉన్న అంశాలతో పెండింగ్ లో ఉన్న అంశాలక పరిశీలనపై చర్చింనట్లు తెలుస్తోంది.

అదే విధంగా 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకు తెలంగాణకు సరఫరా చేసిన విద్యుత్ కు సంబంధించిన బకాయిల క్లియరెన్స్, కేంద్రం నుంచి ఏపీ రావాల్సిన పన్నుల చెల్లింపుల వాటా,  జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఏపీకి మరింత ఎక్కువ కవరేజీ ఇచ్చే అంశంపై ప్రధాని వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కొత్తగా రాష్ట్రంలో 56 లక్షల కుటుంబాలకు కేంద్రం రేషన్ దక్కే అవకాశం ఉంది. విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీల గురించి ప్రధాని దగ్గర సీఎం జగన్ ప్రస్తావించినట్లు సమాచారం. ఏపీ  పౌరసరఫరాల శాఖకు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సబ్బిడీ బకాయిల ను క్లియర్ చేయడం, ఏపీఎండీసీ కింద ఏర్పాటయ్యే ప్లాంట్లకు ముడి ఖనిజం ఇచ్చేలా కేంద్ర గనుల శాఖకు ఆదేశాలు ఇవ్వాలని సీఎం జగన్ కోరినట్లు తెలుస్తోంది.

ప్రధాని మోదీ జరిగిన భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం జగన్ సమావేశమయ్యారు. నిర్మల సీతారామన్ తో అరగంట పాటు సాగిన సీఎం జగన్ సమావేశమయ్యారు. ఇక సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో పలువురు వైసీపీ ఎంపీలు కలిశారు. ఢిల్లీ విమానాశ్రయంలో సీఎంకు వైఎస్సార్ సీపీ  పార్లమెంటరీ  నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఎంపీలు ఆర్. కృష్ణయ్య, నందిగం సురేష్, రెడ్డప్ప, అయోథ్య రామిరెడ్డి, వంగా గీత, చింతా అనురాధ, గొడ్డేటి మాధవి, గోరంట్ల మాధవ్, ఎం.గురుమూర్తి, బెల్లాన చంద్రశేఖర్ తదితరులు ఘనస్వాగతం పలికారు. మొత్తంగా ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి