iDreamPost

విశాఖలో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించిన CM జగన్

విశాఖలో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించిన CM జగన్

ఆంధ్రప్రదేశ్ లోని యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించి దిగ్గజ కంపెనీల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటూ వినూత్న పథకాలను ప్రవేశపెట్టి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఈ క్రమంలోనే నిరుద్యోగ యువతకు సైతం ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు కల్పించేందుకు అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగానే నేడు విశాఖపట్నంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి దేశంలో దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. విజయవాడ నుంచి విశాఖకు ప్రత్యేక విమానంలో బయలుదేరారు సీఎం జగన్. ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్ కు వైసీపీ లీడర్లు ఘనస్వాగతం పలికారు. విశాఖలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దీనిలో భాగంగానే విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఐటీ, ఫార్మా సంస్థల ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయనున్నారు. ఈ క్రమంలోనే ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించారు సీఎం జగన్. ఈ కంపెనీ ఏర్పాటుతో దాదాపు 4,160 వేల మందికిపైగా ఉద్యోగాలు లభించనున్నాయి. దీంతో నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తూ సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి