iDreamPost

బాబు చేతగానితనం సరిదిద్దడానికి సగం ఖర్చు చేస్తున్న జగన్

బాబు చేతగానితనం సరిదిద్దడానికి సగం ఖర్చు చేస్తున్న జగన్

ఏపీలో రాజకీయాలు మాత్రమే కాదు పాలనా వ్యవహారాలు కూడా ఆసక్తికరంగానే కనిపిస్తున్నాయి. సహజంగా ప్రభుత్వాలు మారడం ఓ ప్రక్రియ ప్రకారం సాగుతోంది. ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీ అధికారంలోకి రావడం, తాను అనుకున్న విధానాలు, ఇచ్చిన హామీల అమలుకి పూనుకోవడం జరుతుంది. కానీ ఏపీలో అలా కనిపించడం లేదు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చి ఏడాది తర్వాత కూడా జగన్ గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు తీర్చడానికే సరిపోతోంది. తాను ఇచ్చిన హామీల అమలుకోసం ప్రయత్నాలు చేస్తూనే చంద్రబాబు ప్రభుత్వ చేతగానితనం సరిదిద్దడానికి జగన్ తన సగం సమయానికి, బడ్జెట్ ను కేటాయించాల్సి వస్తున్నట్టు కనిపిస్తోంది.

ఇప్పటికే గత ప్రభుత్వ హయంలో అమాంతంగా పెరిగిన అప్పులకు వడ్డీ కింద ఏటా రూ.20వేల కోట్లు చెల్లించాల్సి వస్తోంది. చంద్రబాబు హయంలో కేవలం ప్రచారం కోసం చేసిన ఖర్చు ఇప్పుడు తడిసిమోపుడు కావడంతో ఏపీ ప్రభుత్వానికి భారం అవుతోంది. దానిని ప్రస్తుత ప్రభుత్వం మోయాలసి వస్తోంది. అందుకు తోడుగా డిస్కమ్ లకి చెల్లించాల్సిన బకాయిలు రూ. 30వేల కోట్ల వరకూ ఉన్నాయి. ఇప్పటి వరకూ జగన్ ప్రభుత్వం అందులో నాలుగో వంతు తీర్చగలిగింది. ప్రజా సంక్షేమానికి రూ. 40వేల కోట్లకు పైగా కేటాయిస్తూనే మరోవూపు ఇలా చంద్రబాబు తీర్చాల్సిన బకాయిలను కూడా జగన్ ప్రభుత్వమే తీర్చే బాధ్యతను నెత్తికెత్తుకోవాల్సి రావడం విశేషంగా మారింది.

తన హామీలు, తన విధానాల అమలుతో పాటుగా చంద్రబాబు వైఫల్యాలకు ఇప్పుడు ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు. అయినప్పటికీ జగన్ ప్రభుత్వం మాత్రం వెనకాడకుండా ప్రచార అర్భాటాలకు తావులేని పాలనతో సాగుతున్నారు. మిగిల్చిన మొత్తాన్ని ప్రజల సంక్షేమానికి వ్యయం చేస్తూనే పెండింగ్స్ ని క్లియర్ చేసే పనిలో పడ్డారు. డిస్కమ్ లకు ఇప్పటికే రూ. 7వేల కోట్లు చెల్లించారు. ఇక విద్యార్థులకు ఫీజ్ రీయంబెర్స్ మెంట్ బకాయిల విషయంలో కూడా చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యం చేశారు. దాంతో వాటిని కూడా రూ. 1800 కోట్లను జగన్ ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చింది. ఇక కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు కూడా పెద్ద మొత్తంలో పెండింగ్ పెట్టిన చంద్రబాబు తీరు వల్ల జగన్ ప్రభుత్వానికి భారంగా మారింది. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన 45,000 కోట్ల కాంట్రాక్ట్ బిల్లుల్లో ఇప్పటి వరకూ రూ 25,000 కోట్లు క్లియర్ చేసినట్టు చెబుతున్నారు.

చివరకు పేదల ఇళ్ల నిర్మాణానికి కేటాయించిన నిధులను కూడా చంద్రబాబు విడుదల చేసిన దాఖలాలు లేవు. దానికారణంగా ఇప్పుడు జగన్ ప్రభుత్వం వాటిని కూడా చెల్లించే బాధ్యత తీసుకుంది. నిరుపేదలు నష్టపోకుండా చూస్తామని చెప్పిన జగన్ దానికి అనుగుణంగా తప్పు చంద్రబాబుదే అయినా, బాధ్యత తీసుకుని రూ.1300 కోట్లకు పైగా నిధులను చెల్లించేందుకు పూనుకుంది. తాజాగా హౌసింగ్ సమీక్షలో సీఎం జగన్ ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలో లబ్దిదారులకు నిధులు నేరుగా అందించబోతున్నారు. రెండేళ్లుగా ఎదురుచూస్తున్న వారికి ఇన్నాళ్లకు మోక్షం కలుగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖ నిధులను మళ్లించడంతో నష్టపోయిన వారికి ఇప్పటికీ నష్టం పూడ్చే పనిని జగన్ ప్రభుత్వం చేస్తోంది. దాంతో ఇన్నాళ్లుగా ఆశతో ఎదురుచూసిన వారంతా జగన్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. తన ప్రభుత్వహయంలో కాకపోయినా, తాను బాధ్యతగా పేదలకు భరోసాగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి