iDreamPost

సీఎం జగన్‌ మరో కొత్త ఆలోచన.. గ్రామీణ ఆరోగ్యమస్తు.. 11,158 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు..

సీఎం జగన్‌ మరో కొత్త ఆలోచన.. గ్రామీణ ఆరోగ్యమస్తు.. 11,158 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు..

గ్రామ సచివాలయం.. దేశ చరిత్రలోనే సరికొత్త విధానం. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్వం ఆచరణలో చూపెట్టిన జగన్‌ సర్కార్‌ ఇదే కోవలో మరో ముందడుగు వేయబోతోంది. విద్య, వైద్యం, వ్యవసాయం.. మూడు అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న జగన్‌ సర్కార్‌ ఆ దిశగా ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వైద్యానికి సంబంధించి సీఎం జగన్‌ తన సరికొత్త ఆలోచనను వెలిబుచ్చారు. త్వరలో వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ ఏర్పాటు చేస్తామని ఇటీవల విజయనగరంలో ప్రకటించారు.

వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు, నాడు – నేడు కింద ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి, కొత్తగా 5000 ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాల నిర్మాణంతో ప్రజా ఆరోగ్యానికి పెద్ద పీట వేసిన జగన్‌ తాజాగా గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లతో నాంధి పలకనున్నారు. గ్రామ సచివాలయాలకు పక్కనే ఈ క్లినిక్‌లు ఉంటాయని జగన్‌ చెప్పారు. అంటే రాష్ట్రంలో 11,158 గ్రామ సచివాలయాలకు గాను 11,158 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు రాబోతున్నాయి. ఇందులో ఒక బీఎస్సీ నర్సింగ్‌ చదివిన ఉద్యోగి, ఒక ఏఎన్‌ఎంలు 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని సీఎం ప్రకటించారు. ప్రస్తుతం గ్రామ సచివాలయంలో హెల్త్‌ అసిస్టెంట్‌ ఉండగా.. కొత్తగా బీఎస్సీ నర్సింగ్‌ చదివిన 11,158 మందిని నియమించే అవకాశం ఉంది. అంటే కొత్తగా మరో 11,158 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు లభించనున్నాయి.

గ్రామ సచివాలయం ద్వారా రేషన్‌కార్డు, పొలం సమస్యలు, ఇతర ఏ పని అయినా తమ గ్రామంలోనే ప్రజలకు అందుబాటులో వచ్చింది. త్వరలో ఏర్పాటు చేయబోయే రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు, పంట ఇన్సూ్యరెన్స్‌ తదితర వ్యవసాయ సంబంధమైన అవసరాలన్నీ లభించనున్నాయి. వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేడయం వల్ల జ్వరం, దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న అనారోగ్యాలకు ఉచితంగా వైద్యం లభించనుంది. ప్రస్తుతం పలు గ్రామాల్లో ఆర్‌ఎంపీలు ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి