iDreamPost
android-app
ios-app

బిగ్‌ బ్రేకింగ్‌: A1గా చంద్రబాబు, A2గా లోకేశ్‌! కేసు నమోదు చేసిన CID

  • Published May 05, 2024 | 1:14 PM Updated Updated May 05, 2024 | 1:30 PM

CID, Chandrababu Naidu, Nara Lokesh, AP Land Titling Act 2023: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌పై ఎన్నికల సంఘం ఆదేశాలతో సీఐడీ కేసు నమోదు చేసింది. కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

CID, Chandrababu Naidu, Nara Lokesh, AP Land Titling Act 2023: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌పై ఎన్నికల సంఘం ఆదేశాలతో సీఐడీ కేసు నమోదు చేసింది. కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published May 05, 2024 | 1:14 PMUpdated May 05, 2024 | 1:30 PM
బిగ్‌ బ్రేకింగ్‌: A1గా చంద్రబాబు, A2గా లోకేశ్‌! కేసు నమోదు చేసిన CID

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ వారిపై ఎన్నికల కమీషన్‌ సీరియస్‌ అయింది. ఫేక్‌ ప్రచారం చేసినందుకు గాను వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో ఏపీ సీఐడీ చంద్రబాబు, లోకేశ్‌లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబును ఏ1గా, లోకేశ్‌ను ఏ2గా చేర్చింది సీఐడీ. కాగా, 2023లో తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై ఇప్పుడు ఎన్నికల సందర్భంగా.. ఆ చట్టంతో భూములు పోతాయని, మొత్తం భూమి ప్రభుత్వం లాకేసుకుంటుందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా మండిపడ్డారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ఇలా అబద్ధాలు ప్రచారం చేస్తారా? అంటూ విపక్షాలను కడిగిపారేశారు.

అసలు ఈ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ అంటే ఏంటి?
ఏపీలో చాలా భూమి ఉంది. అందులో వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమితో పాటు ఇంకా చాలా రకాల భూములు ఉన్నాయి. వాటికి సంబంధించి.. 30కి పైగా రికార్డులు ఉన్నాయి. అవి ఎప్పుడో బ్రిటీష్‌ కాలానికి సంబంధించిన రికార్డులు. అవన్నీ తప్పుల తడకగా ఉన్నాయి. కోర్టుల్లో భూమికి సంబంధించిన కేసులు ఏళ్ల తరబడి సాగేందుకు ప్రధాన కారణం సరైనా రికార్డులు లేకపోవడం, ఉన్న రికార్డులు కూడా తప్పులు తడకగా ఉండటం. ఇవే కాదు ఇంకా చాలా సమస్యలు భూమి చుట్టూ ఉంటాయి. వాటిని పరిష్కరించి భూ యజమానికి.. ఆ భూమిపై పక్కా యాజమాన్యపు హక్కు కల్పించి, వారి వారసులకు భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడమే ఈ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ముఖ్య ఉద్దేశం.

రాష్ట్రంలో ఉన్న భూమి ఎంత ఉంది. ఎవరి ఆధీనంలో ఉంది అనే విషయాలు టైటిల్‌ రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. ప్రస్తుతం ఉన్న రికార్డుల్లో భూమి మన పేరున ఉన్నా.. వేరే వ్యక్తులు ఆ భూమి తమదేనని అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది, కానీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ అమల్లోకి వస్తే భూమి యజమానులకు అలాంటి సమస్యలు ఉండవు. భూముల లెక్కలు తేల్చిన తర్వాత.. ఎలాంటి వివాదం లేని భూములను టైటిల్‌ రిజిస్టర్‌లో నమోదు చేసి.. వివాదాల్లో ఉన్న భూమి వివరాలును ఓ ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. ఆ వివాదాలను పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో ఒక ట్రైబ్యునల్, రాష్ట్ర స్థాయిలో మరో ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ట్రైబ్యునల్ తీర్పు మీద అభ్యంతరాలు ఉంటే హైకోర్టును కూడా ఆశ్రయించే అవకాశం కల్పిస్తోంది ఈ ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ 2023.

ప్రస్తుతం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ 2023ను రాష్ట్రంలో ఎంపిక చేసిన 16 రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉండటంతో ఒక పైలెట్‌ ప్రాజెక్ట్‌ కావడంతో భూమి వివరాలు నమోదు చేసిన తర్వాత.. ఒరిజినల్‌ పట్టా కాకుండా.. జిరాక్స్‌ పత్రాలు ఇస్తున్నారు. అయితే.. ఇలా టైటిల్‌ రిజిస్టర్‌లో నమోదు అయిన భూమిపై.. రెండేళ్ల వ్యవధిలోనే అభ్యంతరాలు వ్యక్తం చేయాలి. ఒకవేళ రెండేళ్లలోపు అభ్యంతరాలేవీ లేకపోతే.. ఆ తర్వాత కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదు. ప్రస్తుతం భూమి ఎవరి పేరున అయితే ఉందో.. వారు తమ పేర్లను ఈ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ప్రకారం.. నమోదు చేయించుకుంటే.. భవిష్యత్తులో వారికి ఎలాంటి చిక్కులు కూడా ఉండవు. అలాగే భుమిపై ప్రభుత్వం ఎలాంటి పథకాలు ప్రవేశ పెట్టినా.. అవి సక్రమంగా అర్హలకు మాత్రమే అందే అవకాశం ఉంది. ఇన్ని మంచి ఉపయోగాలు ఉన్న ఈ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌పై ప్రతిపక్షాలు అనవసరంగా అబద్ధాలు ప్రచారం చేసి.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయని రాజకీయ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.