iDreamPost
android-app
ios-app

రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రారంభమైన CID విచారణ!

రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రారంభమైన CID విచారణ!

ఏపీలో స్కీల్ డెవలప్మెంట్ స్కామ్ పెను సంచలనం సృష్టించింది. ఈ స్కాంలో ఏకంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే అరెస్టు అయ్యారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అలానే శుక్రవారం చంద్రబాబుకు ఒక్కేసారి మూడు ఎదురు దెబ్బలు తగిలాయి.  ఆయన తరపున వేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. అలానే ఆయనను సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో  నేడు, రేపు చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించనున్నారు. తొలి రోజులో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైలులో సీఐడీ విచారణ ప్రారంభమైంది.

స్కీల్ స్కాం కేసులో భాగంగా కోర్టు ఆదేశాలతో రాజమండ్రి సెంట్రల్ జైలులో సీఐడీ విచారణ ప్రారంభమైంది. జైల్ కాన్ఫరెన్స్ హాల్ లో చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబును సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు బృందం ప్రశ్నిస్తోంది. సీఐడీ ధనుంజయుడు నేతృత్యంలోని 12 మంది సభ్యుల బృందం ఈ విచారణ చేపట్టింది. ఉదయం 9.30కి ప్రారంభమైన ఈ విచారణ సాయంత్ర 5 గంటల వరకు కొనసాగనుంది. చంద్రబాబుకు వైద్య పరీక్షలు పూరైన తరువాత సీఐడీ బృందం విచారణ చేపట్టింది. చంద్రబాబును విచారించేందుకు సీఐడీ అధికారులు దాదాపు 100 నుంచి 110 ప్రశ్నలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. వీటికి చంద్రబాబు ఇచ్చే సమాధానాలను బట్టి.. మరిన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.

ఇక విచారణలో ఇద్దరు మధ్యవర్తులు, ఒక ఫోటో గ్రాఫర్ ఉన్నారు. చంద్రబాబు చెప్పే సమాధానాలను రికార్టు చేసేందుకు ల్యాప్ ట్యాప్ , ప్రింటర్లను వినియోగిస్తున్నారు. చంద్రబాబు తరపున ఒక న్యాయవాదికే అనుమతి ఇచ్చారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సీఐడీ విచారణ ప్రారంభించింది. విచారణలో ప్రతి గంటకు 5 నిమిషాల పాటు బ్రేక్ ఇస్తారు. విరామ సమయంలో తన లాయర్లతో చంద్రబాబు మాట్లడేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఏపీఎస్పీ,ప్రత్యేక బలగాలు,లోకల్ పోలీసులతో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు.