iDreamPost

విశ్వంభర లేటెస్ట్ అప్ డేట్…. విలన్ గా రావు రమేష్

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. ఈ సినిమాకు సంబంధించి తరుచు ఏదో ఒక వార్త వైరల్ అవుతూ ఉంది. అయితే తాజాగా విశ్వంభర మూవీకి సంబంధించి ఓ లేటెస్ట్ అప్ డేట్ అనేది ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది.

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. ఈ సినిమాకు సంబంధించి తరుచు ఏదో ఒక వార్త వైరల్ అవుతూ ఉంది. అయితే తాజాగా విశ్వంభర మూవీకి సంబంధించి ఓ లేటెస్ట్ అప్ డేట్ అనేది ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది.

విశ్వంభర లేటెస్ట్ అప్ డేట్…. విలన్ గా రావు రమేష్

విశ్వంభర చిత్రానికి సంబంధించి ప్రతీ పాయంట్ ఎక్సైట్ మెంట్ తో కూడుకున్నదే. మొట్టమొదట టైటిల్ ప్రకటించేవరకూ టైటిల్ గురించి ఊహాగానాలు మిన్నుముట్టాయి. ఎవరి టైటిల్ వారు సోషల్ మీడియాలో ప్రకటించేశారు. కథ కూడా ఎవరి స్వచ్ఛంద రచన వాళ్ళది. చాలా ఆసక్తితో సాగింది కొన్నాళ్ళు. వాల్టేర్ వీరయ్య విడుదలై సరింగా సంవత్సర కాలం పూర్తయిన తర్వాత దాదాపుగా ఐ డ్రీమ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ లోనే దర్శకుడు వశిష్ట విశ్వంభర టైటిల్ ఖరారు చేశాడు. కానీ అధకారికంగా సంక్రాంతినాడే టైటిల్ ప్రకటించాలనే ప్రణాళికతో వశిష్ఠ కొంచెం ఆ రోజున కొంచెం మొహమాటపడ్డాడు.

తర్వాత స్టేజిలో లేడీ అర్టిస్టుల విషయంలో కూడా కొంత సస్పెన్స్ కొనసాగింది. ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. గతంలో కొన్ని హిట్లు అందుకుని, మళ్ళీ అవకాశాలు రాని టాలెంటెడ్ యాక్ట్రెసెస్ పేర్లు ఒకటీ ఒకటీ బైటకు వస్తున్నాయి. అసలు ముఖ్యంగా విశ్వంభరలో మెయిన్ విలన్ ఎవరన్నది మొన్నమొన్నటి వరకూ గాలింపు జరుగుతూనే ఉంది. నార్త్ టు సౌత్ అనేకమంది పేర్లు వినించాయి. వినిపిస్తూనే ఉన్నాయి.మెగాస్టార్ చిరంజీవిని ఢీకొనే ఇమేజ్ ఉన్న లేదా అంత భారీ సినిమాలో విలన్ పాత్రను పోషించగలిగే పొటన్షియల్ పరిపూర్ణంగా ఉన్న కేపబుల్ యాక్టర్ ఎవరన్నది భూతద్దం పెట్టి వెతికినా అంతు పట్టలేదు. కెజిఎఫ్ ఫేం యశ్ పేరు కూడా ఒకటైంలో పరిశీలనలోకి వచ్చిందని అనుకున్నారు.

కానీ హిందీ రామాయణంలో ఆల్రెడీ యశ్ రావణుడి పాత్రను ఓకే చేసిన నేపథ్యంలో యశ్ కూడా రిపీట్ అవుతాడని మళ్ళీ నిర్ణయం మార్చుకున్నారని యూనిట్ సభ్యులు కొందరు లీక్ చేశారు. ఇప్పుడింక ఈ భారీ చిత్రంలో మెగాస్టార్ తో సరిసమానంగా తూగగలిగిన మంచి నటుడైతే చాలు, కథా పరంగా పరఫెక్టుగా ఉంటుందన్న ఆలోచనతో తెలుగు నటుడైన ఫరవాలేదనే నిర్ణయం ఈ మధ్యనే తెర మీదకి వచ్చింది. పుష్ప సినిమా పాన్ ఇండియాలో దుమ్ము లేపేసిన తర్వాత చాలా వరకూ తెలుగు దర్శకనిర్మాతల ఆలోచనలలో మార్పు వచ్చింది.

అందులో ఏ హిందీ నటుడూ లేడు. మరే ఇతర భాషా నటుడు కూడా లేకపోయినా, సునీల్ లాంటి రెగ్యులర్ కామెడీ నటుడే అందులో నెగెటివ్ క్యారెక్టర్ చేసి, అది సినిమా విజయానికి మూల స్తంభమైన వైనం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. సో….విశ్వంభర అనే భారీ చిత్రంలో ఆ ప్రతినాయకుడి పాత్రకు అనేకానేక చిత్రాలలో, అదీగాక సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నెగెటివ్ షేడ్స్ లో మంచి సక్సెస్ ని సాధించిన రావు రమేష్ పేరే ఖరారైనట్టుగా తాజా అప్డేట్ ప్రస్తుతానికి. పెరఫారమెన్స్ పరంగా రావు రమేష్ అయితేనే కరెక్టని అందరూ భావిస్తున్నట్టుగా భోగట్టా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి