iDreamPost

కరోనా కట్టడికి భారత్ కి చైనా సాయం…

కరోనా కట్టడికి భారత్ కి చైనా సాయం…

భారత్ లో చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా వైరస్ నియంత్రణలో భారతదేశానికి తమ సహాయం ఖచ్చితంగా ఉంటుందని చైనా వెల్లడించింది. చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జంగ్‌ షుయాంగ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారత్ తమ కష్టకాలంలో తమకు తోడుగా నిలిచి సహాయం చేసిందని గుర్తు చేసుకున్నారు.

తాము కష్టంలో ఉన్నప్పుడు ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లు లేఖలు, ఫోన్‌ సంభాషణల ద్వారా మద్దతు తెలిపారని షుయాంగ్‌ పేర్కొన్నారు. కాగా కరోనా వైరస్ పుట్టిన వుహాన్ నగరంలో వైరస్ విజృంభించినపుడు చైనాకు మాస్కులు, చేతి తొడుగులు, అత్యవసర ఔషధాలు, వైద్య పరికరాలు వంటి 15 టన్నుల సాధనాలను భారత్‌ గతనెల ప్రత్యేక సైనిక విమానంలో భారత్ చేరవేసింది. ప్రస్తుతం చైనాలో వైరస్ వ్యాప్తి తగ్గి సాధారణ స్థితికి చేరుకుంది. కాగా చైనాలో ఉన్న భారతీయుల ఆరోగ్య పరిరక్షణకు, భద్రతకు చర్యలు తీసుకుంటున్నట్టు జంగ్‌ షుయాంగ్‌ వివరించారు. వైరస్‌ నియంత్రణలో తమకు సహాయం అందించిన 19 దేశాలకు ప్రతిసాయం చేయనున్నట్టు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి