iDreamPost

సుందరం VS ఛార్లీ – ఇంటరెస్టింగ్ క్లాష్

సుందరం VS ఛార్లీ – ఇంటరెస్టింగ్ క్లాష్

బాక్సాఫీస్ వద్ద మరో ఇంటరెస్టింగ్ క్లాష్ రెడీ కాబోతోంది. ఎఫ్3 సక్సెస్, మేజర్ – విక్రమ్ రెండూ విజయం సాధించడం థియేటర్లకు మంచి ఊపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఎల్లుండి విడుదల కాబోతున్న రెండు సినిమాలు అంటే సుందరానికి, 777 ఛార్లీ మీద ప్రేక్షకులు దృష్టి సారిస్తున్నారు. ఇందులో మొదటిది న్యాచురల్ స్టార్ నాని మూవీ కాబట్టి సహజంగానే ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు ఎక్కువగా ఉంటుంది. మూడు గంటల నిడివి ఉన్నా సరే పక్కాగా ఎంటర్ టైన్ చేస్తామని యూనిట్ నొక్కి వక్కాణిస్తోంది. మరోవైపు కన్నడ డబ్బింగ్ అయినప్పటికీ 777 ఛార్లీకి సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ భాగస్వామి కావడంతో ప్రమోషన్ పరంగా మెల్లగా బజ్ పెరుగుతోంది

ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రీ రిలీజ్ ప్రీమియర్లు వేశారు. మేజర్ తరహాలో దీనికి రెస్పాన్స్ బాగుంది. పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. కాకపోతే కుక్కతో హీరో బాండింగ్ కాన్సెప్ట్ మీద వస్తున్న ఈ ఎమోషనల్ డ్రామాకు పెట్ లవర్స్ కనెక్ట్ అవుతారు కానీ కామన్ ఆడియన్స్ ఏ మేరకు ఓన్ చేసుకుంటారనేది వేచి చూడాలి. రక్షిత్ శెట్టి మనకు అతడే శ్రీమన్నారాయణతో పరిచయమే కానీ అది ఫ్లాప్ కావడంతో అంతగా రిజిస్టర్ కాలేకపోయాడు. ఇక అంటే సుందరానికి మంచి స్పీడ్ మీదున్నాడు. నాని, నజ్రియా, నరేష్ తో సహా టీమ్ అంతా పోటాపోటీగా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా మీద ఆసక్తి పెంచుతున్నారు. దర్శకుడిగా వివేక్ ఆత్రేయ బ్రాండ్ కూడా బాగా ప్లస్ అవుతోంది.

ఇక్కడితో అయిపోలేదు. జురాసిక్ పార్క్ సిరీస్ లోని చివరి భాగం డొమినియన్ కూడా జూన్ 10నే విడుదలవుతోంది. ఒక రోజు ముందే ఇండియాలో ప్రీమియర్లు వేస్తున్నారు. దీనికి చిన్నపిల్లల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇది లాస్ట్ పార్ట్ అని యూనివర్సల్ పిక్చర్స్ ప్రకటించడంతో ఫైనల్ గా ఓసారి థియేటర్లో చూద్దాం అనుకున్న వాళ్ళ కౌంట్ ఎక్కువగానే ఉంటుంది. సో మొత్తానికి త్రిముఖ పోటీ ఆసక్తికరంగా ఉండబోతోంది. ఎఫ్3 స్లో కాగా మేజర్ కలెక్షన్లు వీక్ డేస్ లో తగ్గాయి. విక్రమ్ మాస్ సెంటర్స్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పుడీ కొత్త సినిమాల ఎంట్రీతో పరస్పరం వసూళ్లు ఎలా ప్రభావితం చెందుతాయో చూడాలి మరి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి