Dharani
Dharani
భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అయ్యింది. ఇస్రోపై ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. మిగతా దేశాలకు భిన్నంగా ఇండియా.. జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టింది. బుధవారం సాయంత్ర 6.03 గంటలకు విక్రమ్ సక్సెస్‌ఫుల్‌గా చంద్రుడిపై ల్యాండ్ అయ్యింది. చంద్రయాన్ 3 విజయం చూసి ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగిపోయింది. సామాన్యులు మొదలు సినీ, రాజకీయ సెలబ్రిటీలు.. ఇస్రో సాధించిన విజయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రయాన్ విజయవంతం కావడంతో.. దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఇక చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్‌పై దేశం మొత్తం ఒకలా స్పందిస్తే.. టీడీపీ కార్యకర్తలు, నేతలు మరో రకంగా స్పందిస్తున్నారు.
దేశంలో ఏం జరిగినా.. ఏలాంటి ఆవిష్కరణలు చేసినా.. ఆఖరికి పతకాలు గెలిచినా.. అది తన వల్లే అని.. తాను చేసిన కృషి వల్లే ఇదంతా సాధ్యం అయ్యిందంటూ డబ్బా కొట్టుకుంటారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఇప్పటికి ఆయన నోరు తెరిస్తే.. హైదరాబాద్‌ని అభివృద్ధి చేసింది నేనే.. ఐటీని డెవలప్ చేసింది నేనే అంటారు చంద్రబాబు. ఆఖరికి సెల్ ఫోన్‌లో ఉన్న టార్చిలైట్‌ను కూడా తానే కనుకున్నాను అంటూ.. ఏమాత్రం మోహమాటం లేకుండా గొప్పలు చేప్పుకోవడం చంద్రబాబు, ఆయన పారీ నేతలకు బాగా అలవాటు. తాజాగా చంద్రయాన్ 3 విజయం సాధించిన వేళ కూడా టీడీపీ తమ్ముళ్లు.. పచ్చ నేతలు ఇదే పైత్యం కనిబరిచారు.
చంద్రయాన్ విజయం సాధించింది.. ఇక ఏపీలో కూడా చంద్రయానమే.. చంద్రోదయమే.. రాబోయే కాలంలో సీఎం అయ్యేది చంద్రబాబే.. అందుకు ఈ చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెసే ఒక ఉదాహరణ.. పైగా 2019లో చద్రయాన్ – 2 విఫలం అయ్యింది.. అదే ఏడాది ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి పాలయ్యాడు. మరి ఇప్పుడు 2024లో చంద్రయాన్-3 విజయం సాధించింది.. అంటే ఇక 2024 ఎన్నికల్లో చంద్రబాబు విజయం కూడా పక్కా.. ఆయన్ని ఎవరూ ఆపలేరు.. జరిగేది చంద్రోదయమే.. అంటూ అర్థంపర్థం లేని పోలిక తెర మీదకు తెచ్చి.. తృప్తి పడుతున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. ఓ ప్రముఖ మీడియా చానెల్లో సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఒకరు ఏకంగా లైవ్‌లో.. ఇక ఏపీలో కూడా చంద్రయానమే.. చంద్రోదయమే అని ప్రజలు చర్చించుకుంటున్నారంటూ.. బహిరంగంగానే.. వ్యాఖ్యానించి.. ట్రోలింగ్ బారిన పడ్డాడు.
గ్రౌండ్ లెవల్లో చూస్తే.. ప్రజలంతా మరోసారి జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారు.. జగన్‌కే తమ ఓటు అని బల్లగుద్ది చెబుతున్నారు. పైగా సర్వేలన్ని ఏపీలో జగనే మరో సారి అధికారంలోకి వస్తారని వెల్లడిస్తున్నాయి. జనసేన-టీడీపీ కలిసి పోటీ చేసినా.. కష్టమే అంటున్నారు. అలాంటిది.. టీడీపీ నేతలు ఏకంగా చంద్రయాన్ విజయంతో తమ భవిష్యత్తును పోల్చుకోవడం చూసి జనాలు నవ్వుకుంటున్నారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కానీ, కీలక నేతలు కానీ ఈ వ్యాఖ్యలు చేయలేదు. కొందరు టీడీపీ నేతలు అత్యుత్సాహంతో చేస్తోన్న ఈ ప్రచారం.. పార్టీ మీద నెగిటీవ్ ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.